Some Quotes

"I will not say I failed 1000 imes,I will say that I discovered there are 1000 ways that can cause failure.......... Thomas Edison" "Believing everybody is dangerous;Believing nobody is very dangerous.......Lincon" "If you start judging people you will be having no time to love them....MOTHER TERESA"

Wednesday, August 25, 2010

Parliamentary Politics and Increasing Money Power

THREE hundred MPs elected to the 15th Lok Sabha in 2009 are crorepatis. The number was 154 out of 543 in the 14th Lok Sabha. Of course, even in the period following independence, industrialists and business houses used to influence people’s representatives through their money power. In the present era of liberalisation, industrialists are trying to enter the legislative bodies directly as people’s representatives.138 out of the total 203 MPs of the Congress party in the Lok Sabha are crorepatis. The main opposition party, the BJP occupies the second place with 58 crorepati MPs.

The value of the total assets declared by the present Lok Sabha MPs while filing their nominations for the parliament elections was Rs 3075 crores. These are the book value of the assets. The real value is considerably more than this. And it is common knowledge that the value of the undeclared assets will be even more.

We call ourselves the largest democracy in the world. We have 72 crore registered voters. The government has declared that the expenditure for holding the 2009 parliament elections was Rs 1120 crores. It is estimated that the total expenditure of the candidates would be more than Rs 10,000 crores. As per the rules, a candidate in the parliament elections cannot spend more than Rs 25 lakhs; in the case of the elections to the state assemblies, the expenditure should not be more than Rs 10 lakhs. If we calculate the total expenditure of all the candidates to the 543 Lok Sabha constituencies, how much would be the expenditure? Even if, say, 10 candidates on an average have contested in each Lok Sabha constituency, the total expenditure should be Rs 1350 crores. Instead, the fact that the total expenditure is estimated at Rs 10,000 crores itself reveals the extent to which the role of money has increased in elections.

When 300 out of the 543 Lok Sabha MPs and 95 out of the total 215 MPs in Rajya Sabha are crorepatis, is it necessary to explain whom the discussions in the parliament benefit and whose interests are protected by the parliament?

77 per cent of the people in our country are surviving on less than Rs 20 per day. On the other hand, the number of Indians among the richest of the world is growing. 58 crores out of our 72 crores registered voters are poor. But ironically, majority of their representatives are crorepatis! Uttar Pradesh leads the other states in poverty and in the number of poor. Parties, which are highly vocal about the oppressed, about the dalits, about social justice, have been ruling the state. The largest number of crorepatis, 52, have been elected from this state!

VOTE TURNED INTO A COMMODITY
The tendency to degrade democracy and make it ridiculous with money power has attained more speed in the era of globalisation. The amount of money offered by various bourgeois parties to the voters for casting their ‘highly sacred vote’, is increasing to such an extent that it is not so easy for the voters to reject it. ‘They pay Rs 150 per person for participating in a procession wearing the party cap. In addition they also give ‘biryani’, and a quarter bottle of liquor. The remuneration is more for distributing voters’ slips house to house. At least Rs 1000 is paid per day for the polling agents. That is why we are quite busy during election time’ said a woman working as a domestic maid. It is clearly evident that market economy has converted election campaign as a business, vote as a commodity and completely robbed democracy of its true spirit. The days of seeking to appease voters calling them ‘gods’ have gone. These are the days when the poor think that they can be happy for at least a few days if the rich contest elections. This is nothing but an effort to change the situation where universal adult suffrage and its power have to kneel down before the might of the money power of the rich.

The policies of liberalisation are very cruel and anti people. But, to implement them, there has to be a government. The electoral system is needed to form the government. And in these elections, only those who support the policies of liberalisation must be elected. Even within the bourgeois democratic system, if elections are held with the true spirit of democracy, there is a possibility of people defeating the ruling classes and elect the Left parties and those who are pro poor. There are such examples all over the world. Sukarno in Indonesia in the 1960s and Allende in Chile in 1971 won elections in their countries. Today, we are witnessing instances of anti imperialist forces and Leftists winning elections in several Latin American countries. In our country too, as early as in 1957 a government led by EMS Namboodiripad was formed in Kerala. In 1967 and later, Left parties were able to form and sustain governments in Kerala, West Bengal and Tripura.

Wherever the Left parties win elections and come to power, they try to implement anti imperialist and anti capitalist policies within the existing possibilities. That is why US imperialism tries to intervene in all the elections held anywhere in the world. It resorts to all sorts of machinations to prevent the Left forces from coming to power. If the Left forces come to power despite these, it continues its scheming against these governments and makes all efforts to topple them.

Marx said that capital tries to go to any corner of the world, enter any sector and do any job to increase its profits and will stoop to any level for this. In the present stage, the role of finance capital has increased manifold. International finance capital is not in a position to tolerate the existence of any force that creates even small hurdles to its movements, activities and exploitation.

Our country is an example. In the 14th Lok Sabha, the UPA government was dependent on the support of the Left parties. We have seen the efforts of the Left parties in blocking the implementation of the economic reforms by the ruling classes. Soon after the results of the 2009 parliament elections came out, Manmohan Singh said that he felt relieved and unshackled. The international and national capitalist class was more elated. The forces of ‘reform’ have utilised all the resources at their disposal to ensure that the strength of the Left, which were creating obstacles in speedy implementation of their reforms, is reduced.

At present the possibility of attacking the Left through semi fascist methods, as was done in the 1972 elections in West Bengal, does not exist. The changes in the method of conducting elections, the changes in the communication system, the increasing awareness among the people, the coming into existence of coalition politics, and more than these, the increased strength of the Left compared to 1972, the continuing unity of the Left forces and the Left having some friends – all these factors are preventing the exact repetition of the 1972 scenario.

That is why finance capital has utilised its own strength – the power of money – liberally in the 2009 elections. That is why the strength of crorepatis has doubled in the 15th Lok Sabha.

MENACE OF PAID NEWS
The ruling classes are increasing poverty through their policies of liberalisation. They are utilising the same poverty as a weakness of the people to gain upper hand in the elections, by throwing in huge amounts of money in the elections. They are trying to attack the consciousness of the people through the strength of the media. The report of the Press Council of India presented in the Council meeting on April 26 demonstrates the gravity of the malaise of ‘paid news’ afflicting the media.

‘Paid news’ is nothing but advertisement creating an illusion of news. Advertisements are counted as election expenses. But, news is not. So, huge amounts of money are collected and reports are written highly praising the candidate. The articles written in this regard by eminent journalist P Sainath exposing the case of Ashok Chavan, chief minister of Maharashtra, are commendable. Same type of ‘news’ in 47 full page supplements, praising Ashok Chavan appeared in three papers within a period of ten days. More than Rs 75 crores should have been paid if these were considered as advertisements. But Ashok Chavan has shown that he spent only Rs 5379 on advertisements in papers during the elections. Of course, it is another matter that the MLA, a member of the family owning the paper got a cabinet berth in Ashok Chavan’s ministry.

In the era of liberalisation, the capitalists in our country are increasing their wealth by outright exploitation of public and natural resources. In 2010 – 11 budget, Rs 39,000 crores were allotted to NREGA, but tax concessions worth Rs Five lakh crores were extended to the corporates. By ensuring that the price of the gas from KG basin is fixed to benefit his interests, Mukesh Ambani gained an additional profit of Rs 65,000 crores. The private telecom companies were benefitted by Rs 60,000 crores, by bidding for the 2 G Spectrum at cheap rates. The Reddy brothers resorted to illegal mining involving an additional three crore tonnes of iron ore. The international price of one tonne of iron ore is Rs 4500. This means that the Reddy brothers earned an additional Rs 1,35,000 crores through illegal iron ore mining! Lakhs of crores of rupees are involved in the allotment of land and in mining in Andhra Pradesh alone.

The ruling classes believe that they should be in majority in the legislative bodies too in order to continue this outright exploitation and amassing of wealth. They are trying to ensure this. They feel that it is not enough to operate behind the scenes; so they are directly coming onto the stage. At one time, there was demarcation between the politicians and capitalists. Now, some of the ‘strong’ politicians are becoming capitalists. And, capitalists are donning the second role of politicians. They are trying to suffocate and smother democracy with their money bags. They are indulging in a show of providing welfare benefits to curtail the resentment of the people. They are starting their own TV channels and newspapers and creating an illusion that what they propagate through their media is the public opinion. While creating irretrievable harm to democracy in practice and acting in most autocratic manner, they propagate that this is democracy. They indulge in malicious propaganda that communists oppose democracy and run dictatorial governments while what they practice is true democracy. Communists and democratic and secular minded people must take this situation as a challenge and expose the drama of the ruling classes. The democratic spirit of the people has to be advanced.

Article from:Markist Paper Written By M V S Sharma

Saturday, June 5, 2010

నైజాం పాలనలో మత ఘర్షణలు, శాంతి యత్నాలు

తెలుగు మాట్లాడే ప్రజల చరిత్రను గమనిస్తే ఒక్క విషయం స్పష్టంగా తెలుస్తుంది. ప్రజలు మత సామరస్యంతో ప్రాంతాలకు అతీతంగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుంది. ప్రజలందరూ తమ శక్తియుక్తులన్నిటినీ సమకూర్చడం వల్లనే సాంస్కృతిక, వాస్తుపరమైన, కళాపరమైన అభివృద్ధి కూడా జరిగింది. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్ర అభివృద్ధి గతంలో ఫ్యూడల్‌ పాలక వర్గాలకూ నేడు భూస్వామ్య-పెట్టుబడిదారీ వర్గాల కూటమికీ మాత్రమే పరిమితమైంది. దోపిడీ పీడనల పట్ల ప్రజల్లో చైతన్యం పెరగుతున్న కొద్దీ వారు పాలక వర్గాల ప్రయోజనాలతో బహిరంగంగా ఘర్షణ పడుతున్నారు. సామాజాన్ని నిర్మించడానికి శ్రామిక ప్రజలు ఒళ్లుగుల్ల చేసుకుంటుంటే పాలక వర్గాలు తమ ప్రయోజనాలు రక్షించుకోడానికి సమాజాన్ని ముక్కలు చేస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్‌లో రాష్ట్ర విభజన/సమైక్యత మీద ప్రస్తుతం జరుగుతున్న చర్చలు అనేక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చాయి. తెలుగు మాట్లాడే ప్రజల చరిత్రకు సంబంధిం చిన విషయం వీటిలో ఒకటి. రాష్ట్ర చరిత్రను గమనిస్తే ఆంధ్ర రాష్ట్రానికి తొలుత ఈనాటి భౌగోళిక స్వరూపం లేదన్న మాట వాస్తవమే అయినప్పటికీ ప్రస్తుత మూడు ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు మాట్లాడే ప్రజలను అనేక మంది పాలకులు ప్రాంతాలతో సంబంధం లేకుండా ఒకే గొడుగు కిందకు తెచ్చారన్న మాట కూడా అంతే వాస్తవం. తెలుగు నేలకు చెందిన ప్రజలు సామరస్యంతో నివసిస్తూ దాని సాంస్కృ తిక, ఆర్థిక, కళాపరమైన పురోగతికి దోహద పడ్డారు.
1
మొట్టమొదటిసారిగా ఆంధ్రుల గురించి క్రీ.పూ.800 సంవత్సరం ఐతరేయ బ్రాహ్మణ గ్రంథంలో పేర్కొనబడింది. అందులో వారి ప్రాంతాన్ని దక్షిణాపథంగా పేర్కొన్నారు. ఆంధ్రులు తనచే పాలించబడుతున్న వారని 13వ శతాబ్దపు అశోకుని శిలాశాసనంలో పేర్కొనబడింది. మౌర్యుల తరువాత శాతవా హనులు ఆంధ్రదేశాన్నీ, దక్కన్‌ పీఠభూమిలోని కొంత ప్రాంతాన్నీ 400 సంవత్సరాలు (క్రీ.పూ. రెండో శతాబ్దం నుంచి క్రీ.శ. రెండో శతాబ్ది వరకూ) పాలించారు. తూర్పు చాళుక్యులు నేడు ఆంధ్ర ప్రదేశ్‌లోని మూడు ప్రాంతాలనూ ఒకచోట చేర్చి రాజకీయ స్థిరత్వాన్ని సమకూ ర్చారు. 7వ, 14వ శతాబ్ద కాలంలో దేశీయ తెలుగు భాషా పద్ధతి సాహితీ మాద్యమంగా ఆవిర్భవించింది. భారతదేశ సంస్కృతిలో తెలుగుకు ఒక ప్రత్యేకస్థానం ఏర్పడింది.
12వ, 13వ శతాబ్దంలో మొత్తం తెలుగు నేలను (త్రిలింగ దేశం అనేవారు) పాలించిన కాకతీయుల పాలన తెలుగువారి సమిష్టి కృష్టి, కలిమికి మచ్చుతునక. కాకతీయుల కాలంలో అభివృద్ధి చెందిన కళలు, వాస్తు శిల్పకళ, సంస్కృతి, భాష, సాహిత్యంలో మూడు ప్రాంతా ల తెలుగువారి భాగస్వామ్యం ఉంది. కాకతీ యుల తరువాత తెలుగుప్రాంతం కృష్ణదేవ రాయల విజయనగర సామ్రాజ్యంలో ఐక్య మైంది. అనంతరం 500 ఏళ్లపాటు తెలుగు వారు విజయనగర, బ్రాహ్మణి, కుతుబ్‌షాహి రాజుల చేత పాలించబడ్డారు. ఈ కాలంలో దక్షిణ-పడమర ప్రాంతాలైన తుంగభద్ర ఒడ్డున ఉన్న ప్రాంతాల నుండి తెలంగాణా, కోస్తాంధ్ర, రాయలసీమ, తాంజోర్‌, మధురై వరకు ఈ రాజ్యాలకింద ఏకీకృతమైనాయి.
కుతుబ్‌షాహీ వంశపాలన స్థాపకుడైన కులీ కుతుబ్‌షా 1518లో స్వాతంత్య్రాన్ని ప్రకటించు కుని మచిలీపట్నం వరకూ ఉన్న తెలుగు ప్రజలను పాలించాడు. హైదరాబాద్‌ నగరాన్ని క్రీ.శ.1590-91 కాలంలో మహమ్మద్‌ కులీ నిర్మించాడు. హైదరాబాద్‌ నిర్మాణానికి డెక్కన్‌ ప్రజలందరినుండీ- ఉత్తర కర్నాటక నుండి మరట్వాడానుండి, ఆంధ్ర, తెంగాణా, రాయల సీమలనుండి - ప్రజల వద్ద పన్నులు వసూలుచేసి డబ్బు సమకూర్చారు.
2
14వ, 18వ శతాబ్ద కాలంలో తెలుగువారి చరిత్రమీద విస్తరిస్తున్న హిందూ మతం, సంస్కృతి ప్రభావంతో బాటు ఇస్లామిక్‌ సంస్కృతి ప్రభావం నిర్ణయాత్మకంగా పడింది. మొట్టమొదటిసారిగా తెలుగుభాష, సంస్కృతిపై డెక్కనీ, ఉర్దు, పర్షి యన్‌ సాంప్రదాయాల ప్రభావం పడింది.
ఈ కాలమంతా మతసామరస్యానికి ఉదాహరణగా నిలిచింది. సుల్తాన్‌ అల్లావుద్దీన్‌ ఖిల్జీ కాలంలో మొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రానికి ముస్లింల రాక ప్రారంభమైంది. ఢిల్లీ నుంచి దౌలతాబాద్‌కు రాజధాని మార్చాలన్న మొహ మ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ ఆలోచన వల్ల ఢిల్లీనుండీ, ఉత్తరాది నుండీ అనేకమంది ప్రజలు దౌలతా బాద్‌కు తరలివెళ్లారు. వీరు ఈ ప్రాంతాల్లో ఢిల్లీ సంస్థలతో పోలిక గల అనే సంస్థలు నిర్మించారు. దీంతో డెక్కన్‌ చరిత్రలో ఒక కొత్త సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్ర ప్రాంరంభమైంది.
డెక్కన్‌లో అల్లావుద్దీన్‌ ఖిల్జీ, మాలిక్‌ కఫూర్‌ విధ్వంసం సృష్టించిన తరువాత, బహ్మనీ, మొగల్‌, అసఫ్‌జాల ఏడు శతాబ్దాల సుదీర్ఘ పాలన తరువాత కూడా డెక్కన్‌లోని హిందూ ప్రాచీన కట్టడాలు చెక్కుచెదరలేదు. ఈ కాలంలో మత ఘర్షణలు జరగలేదు. రెండు మతాలకు సంబంధించినవారు పరస్పర గౌర వంతో మెలిగేవారు. ఒకరి ప్రభావం మరొకరిపై పడడమే కాదు అవి కింది స్థాయివరకు పోనిచ్చారు. ఈ ధోరణి వల్ల ఈ ప్రాంతంలో మిశ్రమ సంస్కృతి ఏర్పడింది. శత్రువులైన బహ్మనీలు, విజయనగర సామ్రాజ్య పాలకులు యుద్ధాలు చేసినా వారి పోరు రాజకీయాలకే పరిమితమైంది. మతఘర్షణలకు వారి మధ్య తావులేదు. ఇద్దరి సామ్రాజ్యాలలో హిందు వులు, ముస్లింలు కీలకమైన బాధ్యతలు నిర్వ హించేవారు. రాజకీయాలు ఇద్దరి సంస్థానా లలో మతాలకు అతీతంగా ఉండేవి.
హిందువుల పండగలైన హోలీ, ఉగాది, దీపావళి, సంక్రాంతి, బసంతిల్లో ముస్లింలు పాల్గొనేవారు. మహ్మద్‌ కులీ పండగలపై తనకున్న మమకారాన్ని అనేక పద్యాల్లో వ్యక్తపరిచాడు. హిందువులు కూడా ముస్లింల పండగలలో ముఖ్యంగా సుఫీ విశ్వాసాలకు దగ్గరగా ఉన్న వాటిలో పాల్గొనేవారు. ఈ విషయంలో 'అషుర్ఖానా' (ప్రవక్త మనవడి యుద్ధసాధనాలు దాచి ఉంచే ప్రదేశం) ముఖ్య పాత్ర నిర్వహించింది. కుతుబ్‌ షాహి సామ్రా జ్యంలోని ప్రతి గ్రామంలోనూ 'పీర్లు' పేరుతో దాని నమూనా ఉండేది.
ముస్లిం పండితులు, సుఫీలు, కవులు, సుల్తాన్‌లు, డెక్కనీని తమ భాషగా మార్చు కున్నారు.. వారు మాట్లాడే భాషలోని అనేక పదాలు రకరకాల ప్రాంతాల భాషల నుంచి సేకరించినవి. కుతుబ్‌షాహీ హిందువులకు, ముస్లింలకు మధ్య ఉన్నత పదవుల్లో తేడా చూపలేదు. తమ సంస్థానంలో జరిగే తగాదాల పరిష్కారానికి ఆయా మత సంబంధిత నియ మాలు తెలియజేయడానికి సుఫీలు, ఖాజీలు, హిందు పండితులను పిలిచేవారు. కుతుబ్‌షాహీ సామ్రాజ్యంలో హిందువులు పూర్తి రక్షణనూ, స్వేచ్ఛనూ ఆస్వాదించేవారు. గోల్కొండ సామ్రా జ్యంలో ఇస్లాంలోకి బలవంతపు మార్పిడి జరిగిన దాఖలాలు లేవు. ఆనాడు సమాజంలో మతసహనం, విశాల దృక్పథం, మానవతా వాదం ఇమిడివుండేవి. ముస్లింలు, హిందువులు ఒకరి సంస్కృతీ, సాంప్రదాయాల ను మరొకరు ఇచ్చిపుచ్చుకునేవారు. ఆనాటి సాహిత్యం, శిల్పకళ, పండగలు రెండు మతాల మేలికలయి కను చాటిచెపుతాయి.
ప్రొఫెసర్‌ పనికర్‌ దీనిగురించి ఇలా చెప్పారు: ''బ్రిటిష్‌ వారు రాకముందు భారత్‌లో అన్ని సంస్కృతుల మేలుకలయిక జరిగింది. ఆ నాడు దేశంలో మతసామరస్యం ఒక్కటి మాత్రమే ఉన్నంత మాత్రాన ఈ క్రమం జరిగేది కాదు. ఒక మతం నుండి మరో మతం ఇచ్చి పుచ్చుకోవడం జరిగిందంటే ఒకరి మతం పట్ల మరొకరికి గౌరవం, అభిమానం ఉన్నాయన్న మాట. ఇటువంటి ధోరణి వల్లనే గత 2000 సంవత్సరాల కాలంలో మన దేశంలో ఒక సంస్కృతి మరో సంస్కృతిలోకి చొచ్చుకుపోవడం జరిగింది''
3
1724 తరువాత డెక్కన్‌ పీఠభూమి చరిత్ర.. ఇంగ్లాండ్‌, ఫ్రాన్సులకు చెందిన ఈస్ట్‌ ఇండికా కంపెనీల వ్యాపార, వలసవాద ప్రయో జనాలచేతా, అసఫ్‌జాహీ నిజామ్స్‌, మరాఠా పీష్వాస్‌, కర్నాటక రాజుల రాజకీయ యుద్ధా లచేతా లిఖించబడింది. డెక్కన్‌ భూమిని 1724 నుంచి సెప్టెంబరు 1948 వరకూ అసఫ్‌జాహీ నిజామ్స్‌ పాలించారు.
1768 -1801 మధ్య కాలంలో నిజాం తను చేసిన అప్పుకు గాను ఆంధ్ర, రాజలసీమ ప్రాంతాలను బ్రిటిష్‌ వారికి అప్పగించాడు. 1768లో ఉత్తర సర్కారు జిల్లాను బ్రిటిష్‌ వారికి బదిలీ చేశాడు. 1788లో గుంటూరు సర్కా రును అప్పగించాడు. 1800లో ఒక ఒప్పందం కింద నిజాం రాయలసీమ జిల్లాలు, బళ్లారి (ప్రస్తుతం కర్నాటకలో ఉన్నది)పై హక్కులను బ్రిటిష్‌వారికి దారాదత్తం చేశాడు. అయితే ప్రస్తుతం నెల్లూరు, ప్రకాశం జిల్లాలుగా ఉన్న నాటి నెల్లూరు ప్రాంతాన్నీ, చిత్తూరు జిల్లాలోని కొంత ప్రాంతాన్నీ 1781లో బ్రిటిష్‌ వారు ఆర్కాట్‌ నవాబు నుండి స్వాధీనం చేసుకున్నారు. దాంతో 1801 నాటికి తెలుగు మాట్లాడే ప్రజలు రెండు ప్రాంతాలుగా విడిపోయారు. అందులో ఒకటైన తెలంగాణా నిజాం ఫ్యూడల్‌ వంశపారంపర్య పాలన కిందకు పోయింది. రెండోదైన ఆంధ్రగా పిలవబడే ప్రాంతం బ్రిటిష్‌ పాలనలోని మద్రాసు ప్రెసిడెన్సీ కిందకు పోయింది. అందువల్ల మొత్తం 2000 సంవత్సరాల తెలుగు ప్రజల చరిత్రలో 1801 నుండి 1947 మధ్య కాలంలో మాత్రమే వారు రెండు విభిన్న రాజకీయ, ఆర్థిక వ్యవస్థలుగల ప్రభుత్వాల కింద చీలి ఉన్నారు. ఈ 150 సంవత్సరాల కాలంలోనే నిజాం పాలనకింద రెండు మతాల ప్రజల మనసుల్లో అనుమాన బీజాలు నాటుకున్నాయి. ఇవి వారి మధ్య ఐక్యతకు ప్రమాదంగా పరిణమించాయి.
అఫ్జల్‌ ఉద్‌ దావ్లా పరిపాలనా కాలంలో 1857 పరిణామాల (మొదటి స్వాతంత్య్ర సంగ్రామం) వల్ల కొంతవరకు హిందూ ముస్లింల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. సాలార్‌ జంగ్‌ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఈ సామరస్య విధానం కొనసాగింది. దీని గురించి క్లాడె కాంప్‌ బెల్‌ తను రాసిన ''నిజాం పాలిత ప్రాంతాల తీరు'' అన్న గ్రంథంలో ఇలా పేర్కొన్నాడు: ''హైదరాబాద్‌ సంస్థానంలో వివిధ మతాల మధ్య కనిపిస్తున్నంతటి సామరస్యం భాతర దేశంలోని మరే హిందూ, మహమ్మదీయ పాలకుని కిందా కనిపించడం లేదు.'' ఆ విధం గా ఈ కాలంలో మత సామరస్య విధానం కొనసాగింది. కాని మీర్‌ మహమ్మద్‌ ఆలి ఖాన్‌ హయాం వచ్చేసరికి ఈ విధానం నుండి క్రమంతా పక్కకు మరలడం ప్రారంభమైంది.
మీర్‌ మహమహమ్మద్‌ ఆలీ ఖాన్‌ హయాంలో ఎందుకిలా జరిగిందో తెలుసు కోవాలంటే ఈ కాలంలో మొత్తం దేశవ్యా పితంగా మారిన పరిణామాలను గురించి మనం తెలుసుకోవలసి ఉంటుంది. 1857 సంగ్రామం బ్రిటిష్‌ వాడికి వ్యతిరేకంగా పోరాడ టంలో హిందూ-ముస్లిం ఐక్యత యొక్క ఆవశ్యకతను గురించి భారత ప్రజలకు నేర్పి నట్లే వారి ఐక్యతను చెడగొట్టకపోతే వచ్చే నష్టాన్ని గురించికూడా బ్రిటిష్‌ వాడికి తెలియజెప్పింది. దాంతో అప్పటినుండి బ్రిటిష్‌ వాడు భారత ప్రజలను మతాలవారీగా విడగొట్టి ఉంచడానికి ఒక పద్దతి ప్రకారం మత రాజకీయాలను ముందుకు తెచ్చాడు. వలస వాతం సృష్టించిన వాస్తవ పరిస్థితలు అంటే ఆర్థికంగా అభివృద్ధి లేమి, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక మార్పులూ మతతత్వం పెరుగుదలకు పునాదిని ఏర్పరిచాయి.
హిందూమత పునరుద్ధరణ వాదం ప్రాచీన చరిత్రను ఆకాశానికెత్తడం ప్రారంభించింది. అదే సమయంలో మధ్య యుగాల కాలంలో జరిగిన అభివృద్ధిని చిన్నదిగా చేసి చూపింది. వీరు క్రమంగా మతపునరుద్ధరణ వాదం హద్దులూ, మతంలోపల అంతర్గత సమీకరణల హద్దులూ దాటి ముస్లింలను శత్రువులుగా చూపెట్టే స్పష్ట మైన మతతత్వ మార్గాన్ని పట్టారు. ఆ విధంగా క్రమంగా గతంలోని 'పరస్పర గౌరవం', 'అభి మానం' అనే సంస్కృతి నుండి రెండు మతాలూ పరస్పరం అనుమానంతో చూసుకునే స్థితికి వెళ్లాయి. వలసవాద పాలకులు రెండు మతాల మధ్య ఏర్పడిన ఈ మతభావనలను తమకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు. వారు రెండు మతాల్లోని భయాలను ఎగదోసి వేర్పాటు వాద భావనలు పెంచారు.
ఈ పూర్వరంగంలో 1892లో హైదరా బాద్‌లో ఆర్యసమాజం ఏర్పడింది. 1895లో మొట్టమొదటి సారిగా గణేష్‌ ఉత్సవాలను బహిరంగ ప్రదేశంలో నిర్వహించడం జరిగింది. ఈ ఉత్సవం పెరుగుతున్న జాతీయ భావాల నుండి పుట్టుకొచ్చిందే అయినప్పటికీ హైదరా బాద్‌లో అది ఆర్యసమాజ్‌, దాని కార్యకలా పాలతో ముడి వేసుకుంది. హిందూ పండుగల పైన ముఖ్యంగా హిందూ, ముస్లిం పండుగలు ఒకేమారు వచ్చే సందర్భంలో ప్రభుత్వం కొన్ని నిషేధాలు పెట్టింది. దాంతో సంస్థానంలోని హిందువుల్లో అసంతృప్తీ, అస్థిరతా భావం ఏర్పడింది. ఈ నిషేధాలు ఘర్షణలను నివారిం చాల్సింది పోయి కొత్త ఘర్షణలకు కారణ మయ్యాయి. 1765 నుంబీ బ్రిటీష్‌ ప్రభుత్వ మిత్రునిగా ఉంటూ వచ్చిన నిజాం ప్రభుత్వం తమ పాలనలో ప్రజలకు మతస్వేచ్ఛను కలగజేస్తే స్వాతంత్య్ర పోరాటానికి దారితీస్తుం దని భయపడింది. అప్పటినుండి అది హిందు వుల ఉత్సవాలపై నిషేధాలు విధించడం, ముస్లిం మత మజ్లీస్‌-ఇట్టిహద్‌-ఉల్‌-ముస్లిమీన్‌ను సమర్థించడం ప్రారంభించింది.
ఆర్యసమాజ్‌ ఈ పరిస్థితిని ఉపయోగించు కుంది. తన కార్యక్రమాలను ఉధృతం చేసి, తీవ్రమైన ప్రచారానికి పూనుకుంది. మరోవైపు మజ్లిస్‌, ముస్లింల సంఖ్యను పెంచడానికి మతమార్పిడి ప్రారంభించింది. ఇవి ఇరుమతాల మధ్య అనుమానాలు, అపోహలు మరింత పెరగడానికి దారితీశాయి. ఆ విధంగా మత ఘర్షణలు పెరగడానికి కావలసిన బీజాలన్నీ నాటబడ్డాయి. 1930లో డెక్కన్‌ ప్రాంతంలోనూ, 1938లో హైదరాబాద్‌లోనూ మొదటి మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆ తరువాత కాలంలో రాష్ట్రచరిత్ర అనేక రక్తపుటలతో నిండింది.
4
నిజాం హయాంలో రాష్ట్ర సామాజిక, ఆర్థిక జీవనం ఫ్యూడల్‌ దోపిడీకి, గ్రామాల్లో వెట్టి విధానం వల్ల ప్రభావితమైంది. మొత్తం పట్టణ ప్రాంతాలన్నీ కలుపుకుంటే 500 ఫ్యాక్టరీలుండేవి. ఈ పట్టణాల్లో ప్రజల ఆదా యల మధ్య అంతరం అత్యధికంగా ఉండేది. ప్రభుత్వంలోని అత్యున్నతాధికారి జీతం సంవత్స రానికి 5 కోట్ల రూపాయలు. కాగా కార్మికుల సంత్సర ఆదాయం కేవలం రూ.144 నుంచి రూ.720 వరకూ ఉండేది.
ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని కప్పి పుచ్చడంలో భాగంగా ముస్లిం మద్దతు పొందేం దుకు మజ్లిస్‌, నిజాం సహకారంతో ''ముస్లింలు పాలక వర్గం'' అన్న ప్రచారాన్ని అందుకున్నది. దాంతో పెరుగుతున్న హిందూ మధ్యతరగతి, వ్యాపార వేత్తలు, మేధావులు ఈ ప్రచారానికి ఎదురుతిరగడం ఆరంభించారు. దాంతో ఆర్య సమాజం ''హిందూ ప్రజలకు'' నాయకునిగా, 'ముస్లిం పాలకులకు'' వ్యతిరేకిగా ఆదరణ సంపాదించింది.
దేశాన్ని మతపరంగా విభజించాలన్న ప్రతి పాదన ప్రభావం కూడా ఈ ప్రాంతం మీద పడింది. ఖాసిం రజ్వీ నాయకత్వంలోని మజ్లిస్‌ మిలిటెంట్‌ విభాగమైన రజాకార్లు హైదరాబాద్‌ స్వాతంత్య్రం కోసం డిమాండ్‌ చేయడం ప్రారం భించారు. కొన్ని ప్రాంతాల్లో వారు ప్రజలపై హత్యలు, దోపిడీలు చేశారు. బాధితులు హిందువులు కావడం చేత, రజాకార్లు ముస్లిం పాలకుని నాయకత్వంలోని ముస్లిం రాజ్య సిద్ధాంతంతో ప్రభావితమైన ముస్లింలు కావడం చేత హిందువుల్లో భయాందోళనలు మొదల య్యాయి. ఈ పరస్పర అపనమ్మకం తర్వాత కాలంలో భయంకర మతవిధ్వేషాలను సృష్టిం చింది.
భారత జాతీయ కాంగ్రెస్‌ 1940వ దశకం వరకూ కూడా 'సంస్థానాల్లోని' ప్రజల సమస్య లను పట్టించుకోకపోవడంతో ఆర్యసమాజ్‌, మజ్లిస్‌లకు పరిస్థితి వదిలివేయబడింది. ఈ ప్రాంతం కమ్యూనిస్టుల ప్రభావం కిందకు వచ్చేవరకు ఈ పరిస్థితి కొనసాగింది. కమ్యూ నిస్టుల రాకతో ఆంధ్ర మహాసభ ప్రజల సమస్య లను తీసుకుని ఒక మిలిటెంట్‌ సంఘంగా మారింది. ప్రఖ్యాత తెలంగాణా సాయుధ పోరాటాన్ని నడిపింది. ఈ పోరాం ఆర్యసమా జం, మజిలీల విచ్ఛిన్న రాజకీయాలకు పూర్తిగా విరుద్ధమైనది. కమ్యూనిస్టుల నాయకత్వంలో హిందూ, ముస్లిం మతాలకు చెందిన ప్రజలు దోపిడీకి వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొన్నారు. ఈ పోరాటం సందర్భంగా వారు పీడకులది ఏ మతం అన్న విషయాన్ని పట్టించుకోలేదు.
పోలీస్‌ చర్య తరువాత నిజాం ఓడిపో వడం, ఆయన సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడం కొత్త మార్పులు తీసుకు వచ్చింది. అప్పటివరకూ 'మనమంతా పాలక వర్గం' అన్న మజ్లిస్‌ ప్రచారపు భ్రమల్లో ఉన్న ముస్లింలకు ఒక్కసారిగా ఆ భ్రమాత్మక బుడగ పగిలిపోయినట్లయింది. భ్రమాత్మకమైనదే అయినా 'తమ సామాజిక హౌదా పోయింది' అన్న భావనా, వారి పేదరికం వారిని ఒక్క కుదుపుకు గురిచేసింది. తమ మధ్య రాజీతో అధికారంలోకి వచ్చిన బూర్జువా-భూస్వామ్య వర్గాలు సహజంగానే వారి బాధలు తీర్చడానికి గానీ, వారి భయాలు పోగొట్టడానికి గానీ పూను కోలేదు. అంతటితో ఆగకుండా ఈ ప్రాంతంలో ప్రజాదరణ పొందుతున్న కమ్యూనిస్టులను వారు మతతత్వ శక్తులను ప్రోత్సహించడం ప్రారంభిం చారు. తాత్కాలికంగా వారు కమ్యూనిస్టులను ఓడించి ఉండొచ్చుగాక కాని ఈ ప్రయత్నాలు మతవిధ్వేషాలను మరింత పెంచాయి. ఈ కాలంలో ఆర్యసమాజ్‌ స్థానాన్ని జనసంఘం ఆక్రమించి, హిందువుల ప్రయోజనాల కాపాడే, మజ్లిస్‌కు వ్యతిరేకంగా నిలబడే శక్తిగా ముందుకు వచ్చింది.
సమాజానికి జరిగే నష్టాన్ని గురించి ఆలోచించకుండా కాంగ్రెస్‌ పార్టీ, పాలక వర్గాలూ తమ స్వల్పకాల ప్రయోజనాలకోసం మతఘర్షణలు రెచ్చగొట్లే ఎత్తుగడలను అవలం భించారు. దీని గురించి ప్రొఫెసర్‌ ఫణిక్కర్‌ ఇలా రాశారు: ''భారత దేశ రాజకీయాల్లో మతతత్వం అనేది ఒక అంతర్భాగం అయిపో యింది. పాలక వర్గ రాజకీయాలకూ, మత తత్వానికీ మధ్య ఉన్న సంబంధాన్ని అర్ధం చేసుకోకుండా మనం మతతత్వానికి పునాది ఎందుకు పెరుగుతోందో అర్ధం చేసుకోలేం. బూర్జువావర్గ రాజకీయాలు అన్ని సామాజిక విభజనలనూ అందులోనూ అత్యంత ముఖ్యమైన మతాన్ని తన ప్రయోజనాలకోసం ఉపయోగించుకుంటుంది.''
ఒకప్పుడు సహనానికి మారుపేరైన ఆంధ్ర ప్రదేశ్‌ పాలకవర్గాలు చేపట్టిన ఈ అవకాశవాద రాజకీయాల వల్ల నేడు అహ్మదాబాద్‌, ముంబై తరువాత మత ఘర్షణల్లో మూడో రాష్ట్రంగా నిలిచింది. మత ఘర్షణలకు కారణాలు ప్రార్థనా స్థలాల ముందు మైకుల మోతగానీ, ఊరేగింపుల మీద వేయడం గానీ, లేక ప్రార్థనా స్థలాలను అపవిత్రం చేయడంగానీ ఏం జరిగినా వెను వెంటనే మతఘర్షణలు దావానలంలా వ్యాపిస్తున్నాయి. కారణాలేమైనా ఈ మత ఘర్షణలు రెండు మతాల మధ్య నెలకొన్న లోతైన విభజనకు ప్రతిబింబాలుగా ఉన్నాయి.
5
మన దేశం ఎంచుకున్న ఆర్థిక విధానాలు ఈ గాయాలను మన్పే విధంగా లేవు. పాలక వర్గాలు 'పెట్టుబడి-కేంద్రంగా నడిచే' ఆర్థిక విధానాన్ని అవలంభిస్తున్నాయి. ఒకచోట జరిగే అభివృద్ధి క్రమంగా అన్ని ప్రాంతాలకు చేరుతుం దనేది వీరి వాదన. కానీ మనకు కనిసిస్తుందల్లా దారిద్య్రం ఎడారిలో ఒక్కడక్కడా ఒయాసిస్సు ల్లాంటి ధనిక ప్రాంతాలు మాత్రమే. ఇటువంటి పరిస్థితి ప్రాంతీయ ధోరణులు పెరగడానికి మంచి క్షేత్రంగా పనికొస్తుంది. సహజంగానే దీనివల్ల ప్రజలు అభివృద్ధి చెందిన ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. దానివల్ల ఆయా ప్రాంతాల జనాభాలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్‌ వంటి నగరాల్లో నివసించే ముస్లిం లు తమ అవకాశాలు మరింత తగ్గిపోతున్నా యనిభయాందోళనతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇది మతతత్వ శక్తుల పెరుగుదలకు మరింత అవకాశం ఇస్తోంది.
వలస పోవడం ముస్లింల మీద పడుతున్న మరో ప్రభావం. కొంతమంది ముస్లింలు గల్ఫ్‌కు వలసవెళ్లి డబ్బు గడించి వచ్చి హైదరాబాద్‌లో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభి స్తున్నారు. ఇప్పటికే నగరంలో వ్యాపారాల్లో పాతుకుపోయినవారు, ముఖ్యంగా హిందూ మతానికి చెందిన వారు వారిని తమకు పోటీ దారులుగా చూస్తున్నారు. తమ వ్యాపారాలను కాపాడుకోడానికి ఈ వ్యాపార వేత్తలు తమతమ మత సంస్థలను ప్రోత్సహిస్తున్నారు. ఇవన్నీ హైద్రాబాద్‌ నగరాన్ని అగ్నిగుండంగా మార్చాయి.
ఇలా పాలక వర్గాలూ, వారి ప్రతినిధులైన పార్టీలూ తమ స్వార్ధం కోసం మతాన్ని వాడుకు న్నాయి. తమ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు ప్రమాదం వస్తుందనుకున్న ప్రతిసారీ మతఘర్షణలను రెచ్చగొడుతున్నాయి. అధికార పార్టీ ముఠా కుమ్ములాటలను కూడా మతఘర్ణ ణలతో పరిష్కరించుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మత ఘర్షణలు ప్రజల మనస్సుల్లో మతవిధ్వేషాలను మరింత లోతుగా పాదుకొల్పు తున్నాయి. మతతత్వం పెట్టుబడిదారీ వ్యవస్థ సృష్టించిన అవ్యవస్థ అనిప్రొఫెసర్‌ బిపిన్‌చంద్ర చెప్పారు. ఆయితే అది క్రమంగా సమాజంలోని అన్ని వర్గాల్లోకీ ముఖ్యంగా పేదల్లోకి చొచ్చుకు పోతోందని తెలిపారు. ఎందుకంటే వీధుల్లో పోరాటాల్లోకి వచ్చేది పేద ప్రజలే.
ఇప్పటికే మతతత్వంతో నిండిఉన్న పరిస్థి తికి ప్రాంతీయ తత్వం తోడయింది. ఈ రెండూ అసమాన అభివృద్ధి వల్ల తలెత్తినవే. పాలక వర్గాలు ప్రజల మధ్య చీలికలు తెచ్చేందుకు వర్గ అస్థిత్వం మినహా మిగిలిన అన్ని అస్థిత్వాలనూ ఉపయోగించుకుంటున్నాయి. తన ప్రయోజనాలు నెరవేర్చుతా యనుకున్న ప్పుడల్లా అవి మతతత్వం, ప్రాతీయ తత్వం, కులతత్వం వగైరా అన్ని అస్థిత్వాలనూ ఉపయో గించుకుంటాయి. 1960వ దశకం రెండో భాగంలో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయింది. ప్రజలు తమ బాధలపట్ల నిరస నలకు దిగారు. ఈ కాలంలోనే మనం మొదటి సారి కాంగ్రసేతర పార్టీలు ప్రభుత్వ పగ్గాలు చేపట్టడం చూశాం. ఇదే సమయంలో మహా రాష్ట్రలో శివసేన, అస్సాంలో లచిత్‌సేన ప్రాంతీయతత్వాన్ని అస్త్రాలుగా వాడుకుని పెరగడమూ చూశాం. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రత్యేక తెలంగాణావాదం అప్పుడే మొదలైంది.
సంక్షోభ సమయంలో పాలక వర్గాలు కూడా ఒత్తిడికి గురవుతాయి. దాంతో వాటి ప్రాతినిధ్య పార్టీల్లో అంటే పాలక పార్టీలో పదవులకోసం, అధికారం కోసం, నేతల మార్పిడి కోసం కుమ్ములాటలు ప్రారంభమవు తాయి. ప్రజల్లో వర్గ ఐక్యతను విచ్ఛిన్నం చేయ డం కోసమే గాక తమలోని ముఠా తగాదాలను పరిష్కరించుకోడానికి వేర్పాటు వాదాలను ముందుకు తెచ్చి ప్రోత్సహిస్తాయి. 'లేని శత్రువును ఉన్నట్లు చూపించి' ప్రజలను పక్కదోవ పట్టించడానికి పాలక వర్గాలు ప్రయత్నిస్తాయి. ఇతర కులాలు, మతాలకు చెందిన నీ పొరుగు వాణ్ణి శత్రువుగా చూపించి ప్రజల నిజమైన శత్రువు నుండి దృష్టి మళ్లిస్తాయి. ఈ కాలాన్ని ఉపయోగించుకుని అవి తమను తాము కూడదీసుకుని కొత్త దాడులు ప్రారంభిస్తాయి.
సరిగ్గా ఈ పూర్వరంగంలోనే మన రాష్ట్రం లో నయా-ఉదారవాద విధానాలు అమలు పరచడం ప్రారంభించారు. నయా-ఉదార వాదం అంటే వివిధ రంగాలనుండి ప్రభుత్వం తప్పుకోవడమే కాదు అయా రంగాల్లో ప్రయివేటు రంగాన్ని అనుమతించడం, బాగా లాభాలు గడించేట్లు చూడ్డం. సబ్సిడీలు, సామాజిక కార్యక్రమాలు నిలిపివేయడం, పిఎస్‌యులు మూసివేయడం వంటివి జరుగు తూనే ఉన్నాయి. ఇవన్నీ పేద ప్రజల బాధలు మరింత పెంచాయి. పేద ధనిక తారతమ్యాలు పెంచాయి. సంపద కొద్ది మంది దగ్గర పోగ యింది. బలహీనమైన రాష్ట్రాల్లో చొచ్చుకు పోవడం చాలా సులభమని ద్రవ్య పెట్టుబడికి తెలుసు. అందువల్ల తన ఆర్థిక దోపిడీ ఎజెండాతో బాటు ప్రభుత్వాలకు చెందిన అన్ని రంగాలనూ, ప్రతిఘటనోద్యమాలనూ బలహీన పరచడం వెనుక దానికి తనదైన సామాజిక- రాజకీయ ఎజెండా కూడా ఉంది. ప్రపంచీకరణ కేంద్రీకరణకూ, ఏకసదృశ స్థితికీ దారితీస్తోంది. విపరీతమైన కేంద్రీకరణ ముక్కలవడానికే దారితీస్తుంది అని ప్రొఫెసర్‌ అనంతమూర్తి చెప్పారు. ఈరోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలను ముక్కలు చెయ్యాలన్న డిమాండ్లు దీనినుండే పుడుతున్నాయి. నయా-ఉదారవాద సిద్థాంతాన్ని అవలంభించే మతతత్వ శక్తులు ప్రాంతీయ వాదాన్ని లేవనెత్తడానికి ఎలాంటి సిగ్గు బిడియం చూపించవు. బిజెపి, జమత్‌-ఇ-ఉల్లేమా- హింద్‌..రెండూ రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కోరడాన్ని మనం చూస్తాం.
ఈ రోజు ప్రపంచమంతా పాలకవర్గాలు వ్యవస్థాగ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి వారు మార్గాన్వేషణ చేస్తున్నారు. ఈ సంక్షోభం నుండి నష్టాలు లేకుండా లేక తక్కువ నష్టాలతో బయటపడేందుకుగాను వారు భారాలను కార్మిక వర్గం మీదా, ఇతర శ్రామిక ప్రజలమీదా నెట్టేయడానికి ప్రయత్నిస్తారు. ఈ సరికొత్త దాడులకు ప్రతిఘటనను విచ్ఛిన్నం చేయడానికి వారు ప్రజల్లో మరోసారి ఎటువంటి వేర్పాటు వాద ధోరణులనైనా ప్రోత్సహిస్తారు. ప్రజలు కులం/ఉపకులం మతం, ప్రాంతం/ఉప ప్రాంతం, లింగం, జాతి వగైరా ఎన్ని విధాలుగా చీలిపోతే వారిని అంతగా ఉపయోగించుకో వచ్చునన్న సంగతి వారికి తెలుసు. ఎన్ని ముక్క లైతే వారికి అంత సంతోషం. ఎందుకంటే ఆ మేరకు దోపిడీ దారులకు ప్రతిఘటన తగ్గిపోతుంది.
తెలుగు మాట్లాడే ప్రజల చరిత్రను గమ నిస్తే ఒక్క విషయం స్పష్టంగా తెలుస్తుంది. ప్రజలు మత సామరస్యంతో ప్రాంతాలకు అతీతంగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడు తుంది. సాంస్కృతికంగా, శిల్పకళాత్మకంగా, రాష్ట్రం కేవలం అందరిసహకారంతోనే సాధ్య పడుతుంది. ప్రజలందరూ తమ శక్తియుక్తు లన్నిటినీ సమకూర్చడం వల్లనే సాంస్కృతిక, వాస్తుపరమైన, కళాపరమైన అభివృద్ధి కూడా జరిగింది. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్ర అభివృద్ధి గతంలో ఫ్యూడల్‌ పాలక వర్గాలకూ నేడు భూస్వామ్య-పెట్టుబడిదారీ వర్గాల కూటమికీ మాత్రమే పరిమితమైంది. దోపిడీ పీడనల పట్ల ప్రజల్లో చైతన్యం పెరగుతున్న కొద్దీ వారు పాలక వర్గాల ప్రయోజనాలతో బహిరంగంగా ఘర్షణ పడుతున్నారు. సామాజాన్ని నిర్మించడానికి శ్రామిక ప్రజలు ఒళ్లుగుల్ల చేసుకుంటుంటే పాలక వర్గాలు తమ ప్రయోజనాలు రక్షించు కోడానికి సమాజాన్ని ముక్కలు చేస్తున్నారు. అందువల్ల ఈ ప్రయత్నాలను తిప్పికొట్టాలంటే ప్రజల ఐక్యత, వర్గ ప్రాతిపదిపై వారి మధ్య ఐక్యత చాలా ముఖ్యం. కుల, మత, ప్రాంతీయ తత్వాలకు అతీతంగా పీడనకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఏకం కావడం ద్వారానే ప్రజలు విజయాలు సాధిస్తారు.

Article From MarxistPaper Written By ArunKumar

Thursday, May 6, 2010

వేదాల్లో ఏముంది?

ఒక వేయి సంవత్సరాల మానవజాతి పరిణామాన్ని, పురోగమనాన్ని, ఉత్పత్తి శక్తుల అభివృద్ధిని, ఉత్పత్తిలో అభివృద్ధిని, దాని పర్యవసానంగా సమాజజీవనంలో, సామాజిక వ్యవస్థ నిర్మాణంలో, మానవుల మధ్య సంబంధా లలో వచ్చిన మార్పులను వేదాలు చూపుతాయి. భాషా, సాంస్కృతిక, తాత్విక పరిణామం కూడ వీటిలో కనబడుతుంది. వర్ణాలు ఇంకా ఏర్పడని రోజుల్లో రచించిన ఋక్కులలో కులం, మతం, పరలోకం, ఆత్మ వంటి భావనలేమీ కనపడవు. కాని తర్వాత వేదాలలో వీటి ప్రస్తావనలు చోటుచేసుకున్నాయి.రచించినవి. ఆ కాలంనాటి కవుల మానసిక స్థితిని సక్రమంగా అర్థం చేసుకుంటేనే వేదాలను కూడా అర్థం చేసుకోడానికి వీలవుతుంది.
ఈ వేదాలలో ఏమున్నదో కూడా తెలుసుకోవాలి. అంతకు ముందు ఒక ముఖ్య మైన అంశాన్ని మనం పరిగణనలోకి తీసుకో వడం చాలా అవసరం. ఏదైనా ఒక గ్రంథం చదివితే అందులో ప్రస్తావించబడిన అంశాలను బట్టి ఆ గ్రంథ రచనా కాలాన్ని గుర్తించవచ్చు. ఆ కాలంలో ప్రజల జీవన స్థాయి ఎలా ఉండేదో ఊహించ వచ్చు. ఉదాహరణకు: రామాయణాన్ని వాల్మీకి రాసిన కాలంలో రథాలు, గుర్రాలు, పడవలు, నార చీరెలు, విల్లంబులు వంటివి ఉండేవని, కుల వ్యవస్థ స్థిరపడి ఉన్నదని అర్థం అవుతుంది. అలాగే ఆర్యుల పెత్తనానికి లోబడని విస్తారమైన ప్రాంతాలు చాలా ఉండేవని, దండకారణ్యం, ఋష్యమూకం, లంక వంటివి ఆ కోవకే చెందు తాయని గ్రహించగలుగుతాం. అదే సమయంలో ఆంజనేయుడు అమాంతం శరీరాన్ని అనేక రెట్లు పెంచివేయడం, మైళ్లకి మైళ్లు గాలిలో ఎగరడం, రాముడు ఒక్క బాణంతో ఏడు తాటిచెట్లను కూల్చివేయడం, బాణాలతో ఆకాశంలో పైకప్పు నిర్మించడం, రావణుడికి పదితలలు ఉండడం, పుష్పకవిమానం ఏ ఇంజనూ, ఇంధనమూ లేకుండానే నడవడం, ఎందరు దానిలో ఎక్కినా ఇంకా ఖాళీ ఉండడం(అదేమిటోగాని మన రైళ్లలో, విమానాల్లో రిజర్వేషన్లు ముందస్తుగా కోరినా చాలాసార్లు సీట్లు లేవనే సమాధానం వస్తూవుంటుంది) ఇలాంటి అతిశయోక్తులు, కవి/రచయిత కల్పనను, వర్ణణాచాతుర్యాన్నీ ప్రతి బింబిస్తూ కనపడతాయి. కాని అవన్నీ రామా యణ కాలంలో నిజంగా ఉనికిలో ఉన్నట్లు చరిత్రకారులు ఎవరూ ఆమోదించరు. ఇలా ఆమోదించని చరిత్రకారుల్లో అత్యధికులు దేవుడిని పూజించేవారుసైతం ఉన్నారని వేరే చెప్పనక్కరలేదనుకుంటాను.


ఒక నిర్థిష్ట కాలంలో, ఒక కవి/రచయిత జీవిత కాలంలో రాయబడిన గ్రంథం విషయం లో పై అంశాలు వర్తిస్తాయి. కాని వేదాల విషయంలో అలా కాదు. వేద కాలపు రచయి తల, ప్రజల పరిస్థితులను, ఆనాటి సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే మరికొన్ని ప్రత్యేకతలను మనం పరిగణనలోకి తీసుకోవాలి. వేదాలను ఒక రచయిత/కొందరు రచయితలు రాయలేదు. కొన్ని వందల, వేలమంది రచయితలు వేదా లను సృజించారు. ఒక ఏభై, వంద సంవత్స రాలలో రాసినవి కావు. సుమారు వేయి సంవ త్సరాల కాలంలో వేదాల రచన జరిగిందని డా||సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అభిప్రాయపడ్డారు. ఈ వెయ్యి సంవత్సరాల కాలం ప్రారంభంలో లిపి, నిర్థిష్టమైన భాషలేని దశ. చివరికి వచ్చే సరికి భాష నిర్ధిష్ట రూపం పొందింది. లిపి ఏర్పడింది. నోటి మాటగా పలికే దశనుండి రాయగలిగే దశవరకు సాగింది.


పశువుల మందలను వెంటబెట్టుకుని ఎక్కడ సంవత్సరం పొడుగునా నీళ్లూ, గడ్డీ దొరుకు తాయో వెతుక్కుంటూ బయలుదేరిన ఆదిమ గణ వ్యవస్థ వేదరచనా ప్రారంభకాలం. వెయ్యి సంవత్సరాల తర్వాత పరిస్థితి వేరు. అప్పటికి ఆర్యులు భారతదేశానికి రావడం. ఇక్కడి సింధు నాగరికతను ధ్వంసం చెయ్యడం, స్థానిక తెగలలో కొన్నింటిని లొంగదీసుకొని, మరికొన్నింటితో రాజీపడి మొత్తానికి తమ ఆధిపత్యాన్ని సాధించ డం జరిగిపోయింది. వర్ణ వ్యవస్థ ఏర్పడింది. సమాజం ఆదిమ దశ నుండి వర్గ విభేదాలు గల వ్యవసాయిక దశలోకి పరిణతి చెందింది. సూర్యోదయం, వర్షం, మెరుపు -ఇలాంటి ప్రకృతి దృశ్యాలను చిన్నపిల్లల మాదిరి అత్యంత సంభ్ర మాశ్చర్యాలతో చూసి కేరింతలు కొట్టి తమ స్పందనలను కవితలుగా అల్లిన వేదకాలపు తొలి రచయితలకు, ప్రకృతి శక్తులను కొంత అదుపులోకి తెచ్చుకుని వాటితో సహజీవనం చేస్తూ, ఈ ప్రకృతి అస్థిత్వం యొక్క మూల కారణాలను అన్వేషించే తాత్విక చింతన అలవర్చుకున్న వేదాల మలి రచయితలకు చాలా వ్యత్యాసం ఉంది.
ఒక వేయి సంవత్సరాల మానవజాతి పరిణామాన్ని, పురోగమనాన్ని, ఉత్పత్తి శక్తుల అభివృద్ధిని, ఉత్పత్తిలో అభివృద్ధిని, దాని పర్యవసానంగా సమాజ జీవనంలో, సామాజిక వ్యవస్థ నిర్మాణంలో, మానవుల మధ్య సంబంధా లలో వచ్చిన మార్పులను వేదాలు చూపుతాయి. భాషా, సాంస్కృతిక, తాత్విక పరిణామం కూడా వీటిలో కనబడుతుంది. వర్ణాలు ఇంకా ఏర్పడని రోజుల్లో రచించిన ఋక్కులలో కులం, మతం, పరలోకం, ఆత్మ వంటి భావనలేమీ కనపడవు. కాని తర్వాత వేదాలలో వీటి ప్రస్తావనలు చోటుచేసుకున్నాయి.


ఇంతకీ వేదాలెన్ని? - ఋగ్వేదం, సామ వేదం, యజుర్వేదం, అధర్వణవేదం - ఈ నాలుగు వేదాలు ఉన్నట్లు ప్రస్తుత కాలంలో ఎక్కువమంది అంగీకరిస్తారు. కాని వేదాల సంఖ్య కూడా వివాదాస్పదమే. భారతం రచించిన నన్నయ ''వేదత్రయ మూర్తయ: త్రిపురుషా:'' అని అన్నాడు. మూడు వేదాలు, వాటి రూపాలుగా ముగ్గురు దేవుళ్లు - బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు ఉన్నారని నన్నయ భావం. చాలా కాలం వరకు అధర్వణవేదానికి వేదం హౌదా లభించలేదు. తర్వాత కాలంలో భార తాన్ని పంచమ వేదం అని అన్నారు. ఎందుకైనా మంచిదని దానిని రాసిన వ్యాసుడిని విష్ణువు అవతారాల్లో ఒక అవతారంగా కలిపారు. అయినా, దానికి వేదం హౌదా దక్కనట్టే భావించాలి. 'ఆయుర్వేదం' అని ప్రాచీన వైద్య శాస్త్రానికి పేరున్నా, దానికీ వేదం హౌదా దక్కలేదు. పైగా వైద్యులను సమాజంలో అంటరానివాళ్లుగా పరిగణించిన ఘనత కూడా మన ప్రాచీన మనువాదులకే దక్కింది.


మొత్తానికి నాలుగు వేదాలు ఉన్నాయి. వీటిలో అతి ప్రాచీనమూ, అతి పెద్దదీ ఋగ్వేదం. ఇందులో 10,552 ఋక్కులు (రెండు/మూడు లైన్లకు మించని పద్యాల లాంటివి) ఉన్నాయి. వీటిని 1028 సూక్తాలుగా వర్గీకరించారు. అంటే ఒక్కో సూక్తంలో 10 ఋక్కులు ఉంటాయన్న మాట. ఈ సూక్తాలను తిరిగి మండలాలుగా వర్గీకరించారు. మొత్తం ఋగ్వేదం 10 మండలాలు(అధ్యాయాలు). ఇందులో మొదటి మండలంలో 191 సూక్తాలు (అంటే సుమారు 2000 ఋక్కులు) ఉన్నాయి. ఈ మొదటి మండలాన్ని 15 మంది రచయితలు రచించారు. దీనిని బట్టి ఋగ్వేద రచయితలే 100 మందికి పైగా ఉండవచ్చు. ఋగ్వేదంలో ప్రస్తావనకు వచ్చిన వరుణులు, అగ్ని, మిత్రుడు, సూర్యుడు లాంటి దేవతలు, పర్షియన్ల ప్రాచీన గ్రంథం 'అవెస్త'లోకూడా కనపడతారు. ఋగ్వేద సంస్కృత భాషకూ, అవెస్త గ్రంథంలో వాడిని భాషకూ, ఇతర ప్రాచీన ఇండో-యూరోపియన్‌ తెగల భాషలకూ ఉమ్మడి పదాలు చాలా ఉన్నాయి.


తమ సుదీర్ఘయాత్ర అనంతరం సింధు- హరప్ప ప్రాంతానికి చేరుకుని అక్కడి స్థానికులతో తలపడవలసి వచ్చినపుడు ఆర్యులు స్థానికుల సంస్కృతితో, ఇక్కడి దేవతల పట్ల గల నమ్మ కాలతో సైతం తలపడాల్సి వచ్చింది. తమతో బాటు పదిలంగా 'శృతాలు'గా కాపాడుకుని తెచ్చిన తమ పాటలను, కవిత్వాన్ని మరింత కట్టుదిట్టంగా పరిరక్షించవలసిన అగత్యం ఏర్ప డింది. దాని పర్యవసానమే క్రమబద్ధీకరిం చబడి, ఋగ్వేదం రూపం పొందింది. అయితే దీనిలోని పదో మండలం చాలా కాలం తర్వాత మూల గ్రంథానికి చేర్చబడిందని కొందరు పండితులు భావిస్తున్నారు.
ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం - ఈ మూడింటిలోని సారాంశం ఒక్కటేనని దాదాపు అందరూ అంగీకరిస్తున్నారు. సామవేదంలో 1791 ఋక్కులు ఉన్నాయి. వీటిలో అత్యధిక భాగం -దాదాపు 1715 -ఋగ్వేదంలో చెప్పినవే. మధురంగా, శ్రావ్యంగా పాడుకోడానికి వీలుగా తిరిగి రాయబడ్డాయి. సంగీత శాస్త్రానికి సామవేదం ప్రారంభంగా పరిగణిస్తారు.


ఇక యజుర్వేదం సంగతి చూద్దాం. యజ్‌ అన్న మూల పదం నుంచి ఈ పేరు వచ్చింది. దీనికి బలి/నైవేద్యం అని అర్థం. తమ కోర్కెలు తీర్చుకోడానికి దేవతలకు బలియిచ్చే కార్యక్రమమే యజ్ఞం. వర్ణ వ్యవస్థ బలపడ్డాక ఈ తంతు చేసే అర్హత, అధికారం అగ్రవర్ణాలు తమకే సొంతం చేసుకున్నాయి. కాని తొలి రోజుల్లో ప్రతీవాడూ తనకి నచ్చిన దేవతకి నైవేద్యం/బలి సమర్పించేవాడు. గ్రామ దేవతల పండగల్లో ఇప్పటికీ ఈ తంతు మన దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ కనపడుతుంది. మొక్కు తీర్చు కునేటప్పుడు తన కోర్కెను వ్యక్తం చేసే పదాలే/మంత్రాలే యజుర్వేదం సారాంశం. ఐతే కాలక్రమేణా ఎవరూ అతిక్రమించడానికి వీలు లేని, మార్చడానికి వీలు లేని కొన్ని పద్ధతులుగా ఇవి రూపుదిద్దుకున్నాయి. ఋగ్వేదంలో ప్రస్తావించిన దేవతలే, అందులో వ్యక్తీకరించిన కోరికలే, పొగడ్తలే ఇక్కడ ఒక క్రమపద్ధతిలో దర్శనమిస్తాయి. ఆధునిక పరిభాషలో చెప్పా లంటే ఆఫీసు మాన్యువల్‌ అన్నమాట. యజుర్వే దంలో తిరిగి కృష్ణ యజుర్వేదమూ, శుక్ల యజుర్వేదమూ అని రెండు భాగాలు ఉన్నాయి.
ఇక ఆఖరుగా అధర్వణ వేదం. ఇందులో 20 అధ్యాయాలున్నాయి. అయిదువేలకు పైగా రుక్కులు 731 సూక్తాలుగా ఉన్నాయి. ఇందులో ఆధ్యాత్మిక చింతన, పరలోక భావన వంటివేమీ లేవు. కొడవటిగంటి కుటుంబరావు గారు ''ఇది బొత్తిగా ఐహిక సుఖ సాధన కోసం పనికి వచ్చే వేదం'' అన్నారు. అంటే ఈ లోకంలో సుఖంగా బతకడం ఎలా అన్నది చర్చించిన వేదం. ఆయుర్వేదం, ఖగోళ శాస్త్రం వంటివి అభివృద్ధి చెందడానికి వాటి వేరు అధర్వణ వేదంలోనే ఉంది అని అంటారు. బహుశ పరలోకం గొడవ బొత్తిగా లేనందువల్లనో ఏమో అధర్వణవేదాన్ని చాలా కాలంపాటు వేదంగా గుర్తించడానికే నిరాకరించారు.


అన్నింటిలోకీ ప్రధానమైన ఋగ్వేదంలో ఏమున్నది? దేవీప్రసాద్‌ ఛటోపాధ్యాయ ఇలా రాశారు : ''ఈ ఋక్కులు, పాటలు అనేకమైన దేవతలను గురించి చేసిన విపరీతమైన స్తుతు లుగా (అతిగా పొగడటం) భావించవచ్చు. ఆహార ధాన్యాలను దోచుకుంటూ, పశువులను దొంగిలిస్తూ, సంపదలను కొల్లగొడుతూ పరమ నిర్ధాక్షిణ్యంగా వాటిని తమలో పంపకం చేసుకునే ఆటవిక జాతి వీరుల స్తవాలే(పొగడ్తలే) ఈ ఋక్కులు. వారి నాయకులను సభాంగణంలో ''మిత్రులని'', ''పరమ మిత్రులని'', ''మిత్ర శ్రేష్టు లని'', ''పర్వతంలాగా స్థిరమైనవారని'', ''వనస్పతి లాంటి వారని'', ''ఆయుధం లాంటివారని'', ''ఓషధుల్లాంటి వారని'' -వీరు పొగిడేవారు. కొన్ని సమయాల్లో కేవలం భౌతికమైన ఈ లోకంలోని కోర్కెల స్వభావాన్ని కూడా దేవతా స్వరూపంగా వర్ణించేవారు. ఉదాహరణకు- ''గర్భస్రావ రక్షణ దేవత'', సంతాన దేవత' ''మశూచి దేవత'', ''అంటువ్యాధి నివారణ దేవత'' మొదలైనవి. శరీరానికి బలాన్నిచ్చే అన్న దేవతను ఏ విధంగా స్తుతించారో ఇంతకు ముందు వ్యాసంలో చూశాం. అలాగే శరీరానికి మత్తెక్కి ంచే సోమపానీయాన్ని(ఒక విధమైన కల్లు వంటి పానీయం) కూడా పొగిడిన ఋక్కులు ఉన్నాయి.''ఓ సోమమా! నన్ను ఈ ప్రపంచంలో అనంతమైన కాంతి ఉండే చోటికి సూర్యుడుండే దగ్గరికి, చావు, వినాశనం లేని చోటికి తీసు కుపో.వివస్వతుని కొడుకు రాజ్యమేలే చోటికి, స్వర్గం ఉండే రహస్య ప్రదేశానికి, శక్తివంతమైన జలధారలున్న చోటికి చేర్చు. అమరుణ్ని చెయ్యి.ఎక్కడ ఆశలు, కోర్కెలు తీరుతాయో, ఎక్కడ సోమం పుష్కలంగా దొరుకుతుందో, ఎక్కడ తిండి, ఆనందం దొరుకుతుందో అక్కడ నేను శాశ్వతంగా ఉండేలా చెయ్యి.'' (ఇప్పుడు తాగి తందనాలాడేవాళ్లు కూడా ఇంతకన్నా గొప్పగా కోరుకునేది వేరే ఏమన్నా ఉందా?) ఇక్కడ దేవత అన్న పదాన్ని 'పరమాత్మ' అన్న తాత్విక అర్థంతో చూడరాదు. దేవత/దేవుడు అంటే మనిషికి(కోరినది) ఇచ్చేవాడు అన్న అర్థంలోనే ఋగ్వేద రచయితలు ఆ పదాన్ని ఉపయోగించారు. హిందీలో 'దే' అంటే ఇయ్యి అని అర్థం. జ్ఞానం కలిగినవాడు తోటి మానవు డికి ఆ జ్ఞానాన్ని ఇస్తే అతడు దేవుడు- సూర్యుడు, చంద్రుడు వెలుగునిస్తారు కనక దేవతలు. తల్లి జన్మనిచ్చింది గనుక దేవత. తండ్రి విద్యాబు ద్ధులు/బతుకుతెరువు నేర్పుతాడు కనుక దేవత. ఇంటికొచ్చిన అతిథి తనరాక వలన ఆనందాన్ని కలిగిస్తాడు గనుక దేవత. అందుకే ''మాతృ దేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ'' అన్నారు.


ఋక్కుల్లో అత్యధిక భాగం ఇంద్రుడిని పొగిడినవి ఉన్నాయి. అతడు శత్రువులని చీల్చి చెండాడుతాడని, శత్రువుల కోటలను ధ్వంసం చేశాడని, ఆనకట్టలను పగల గొట్టాడని, తెగ తాగి బానకడుపు పెంచుకున్నాడని-ఇలా ఉన్నాయి పొగడ్తలు. ఇంద్రుడి తర్వాత స్థానం వరుణుడిది. ఆ తర్వాత అగ్నిది.... ఇలా తమ నాయకులనుగాని, ప్రకృతి శక్తులను గాని పొగిడిన ఋక్కులేఅధిక భాగం. వేదాల గురించి స్థూలంగా పరిశీలన చేసినపుడు ''వేదాల్లోనే సమస్త జ్ఞానము ఉన్నది'' అన్న నమ్మకం సరైంది కాదని తేట తెల్లం అవుతోంది. అభివృద్ధి శైశవ దశలో ఉన్న మానవ సమాజంలోని విభిన్న ఆలోచనల, కోర్కెల, ఆచారాల, సంస్కృతుల సమాహారంగా వేదాలు మనకి అర్థమౌతాయి. వేదాలపై పరిశోధనలు చేపట్టడం, ఇంతవరకు గమనిం చని, గ్రహించని కొత్త అంశాలమేన్నా ఉంటే బైటపెట్టడం అవసరం. కాని ఇప్పటికి కూడా దేశంలో వివిధ ప్రాంతాలలో ఉన్న వేద పాఠ శాలల్లో కేవలం వేదాలను యధాతథంగా వల్లె వేయడం నేర్పుతున్నారు. ఇంకాస్త శ్రద్ధ ఉన్న చోట వ్యాఖ్యానాలు నేర్పుతున్నారు. ప్రాచీన సమాజపు అవశేషాల్లా వేదపండితులు వ్యవహ రించడం వల్ల ప్రయోజనం ఏమిటో విజ్ఞులంతా ఆలోచించాలి.


ప్రఖ్యాత ఆధునిక భారతీయ తత్వవేత్తల్లో అరవిందఘోష్‌ ఒకరు. యోగిగా పరిగణించ బడిన స్వాతంత్ర యోధుడతను. వేదాలను సామాన్య అర్థంలో చూడరాదని, అందులోని ప్రతీదానికీ వెనుక ఒక విశేష అర్థం, రహస్య జ్ఞానం ఉన్నాయని ఆయన భావించారు. సూర్యుడు అంటే తెలివితేటలు, అగ్ని అంటే శక్తి, సోమం అంటే తాదాత్మ్యత-ఇలా అర్థం చేసుకోవాలని అన్నారు. వేదాల్లో దాగివున్న పరమార్థం పామరులకు అర్థం కాకూడదనే వాటిని ఋషులు నిగూఢంగా ఉండేలా రచించా రని, పామరులు అర్థం చేసుకుంటే వాటిని దుర్వి నియోగ పరిచే ప్రమాదం ఉందని భావించారు.అయితే మరొక ప్రఖ్యాత భారతీయ తత్వవేత్త డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అరబింద ఘోష్‌ అభిప్రాయాలతో ఏకీభవించలేదు. ''అరబిందఘోష్‌ చెప్పిన దానిని అంగీకరిస్తే మన భారతీయ తత్వశాస్త్రం ఒక అత్యున్నత శిఖరం స్థాయిలో ప్రారంభమై క్రమంగా కిందికి దిగజారిపోతున్న క్రమంలో ఉన్నట్లు భావించాల్సి వస్తుంది. కాని తత్వశాస్త్రం సాధారణ మానవ జాతి పరిణామక్రమంలో భాగంగా అభివృద్ధి చెందుతూ వస్తుందనేది విశ్వజనీన సత్యం. తొలినాటి ప్రాథమికమైన, మొరటుగా ఉండిన తాత్విక భావాల నుండి క్రమంగా అభివృద్ధి చెందుతూ భారతీయ తత్వశాస్త్రం అభివృద్ధి చెందింది. మొదట్లోనే అత్యంత ఘనంగా, లోపరహితంగా రూపొంది క్రమేణా దిగజారిపోయిందని భావించలేము.'' ఆధ్యా త్మికవాది అయినా, రాధాకృష్ణన్‌ చారిత్రిక దృష్టితో ఈ విషయంపై సరైన వైఖరినే తీసుకున్నారని, అరబిందఘోష్‌ వైఖరి సనాతన పాలకవర్గాలను బలపరిచేదిగా ఉందని స్పష్టమౌతూనే ఉంది కదా.


ప్రఖ్యాత రచయిత కొడవటిగంటి కుటుంబ రావు ఇలా అన్నారు : ''దాచిపెట్టిన జ్ఞానం నిరుపయోగం కావడమే గాక ప్రజలను పీడించ డానికి సాధనమౌతుంది'' అని తెలిసినవాళ్లు చెబుతారు. వేదాల విషయంలో ఇదే జరిగినట్లు కనబడుతుంది. వేదాలను బ్రాహ్మణులు గుత్తకు తీసుకుని వేదాధ్యయనానికి నిషేధాలు కల్పించి అందులో ఏమున్నదీ ఎవరికీ తెలియకుండా చేశారు. ఈ పరిస్థితిని ఆధారం చేసుకుని కొందరు ముందుకుపోవడమంటే భయమూ, అసహ్యమూ కలవాళ్లు వేదాల్లో లేనిదేదీలేదని ప్రజలను నమ్మించజూశారు.'' ''వేదాలను గురించీ, ఆ కాలపు మనుషుల గురించీ తెలుసుకొనడం మనకీనాడు ఎంతైనా అవసరం. ఎందుకంటే అప్పటికీ, ఇప్పటికీ జీవితంలోనూ సమాజ స్వరూపంలోనూ ఊహించరాని మార్పులెన్నో వచ్చినా మన సంస్కృతి అంతా ఆ వేదాల మీదే ఆధారపడి పెరిగింది. ఈ ఇరవయ్యో శతాబ్ధంలో ఈ సంస్కృతిలో మౌలికమైన మార్పులు రాకపోతే మనం ప్రపంచ సంస్కృతికి వెనుకబడి వుండటం తప్పనిసరి అవుతుంది. అందుకని తెలిసినవాళ్లు వేదాలను గురించీ, వేదకాలపు జీవితం గురించీ సాధ్యమైనన్ని వాస్తవ విషయాలను ప్రజలకు తెలియజెప్పాలి.'' ఇంతకీ వేదాల్లో ఉన్న తాత్విక సారాంశం ఏమిటి? భావవాదమా? లేక భౌతికవాదమా? అని ఎవరికైనా సందేహం రావచ్చు. రామాయణ మంతావిని రాముడికి సీత ఏమౌతుంది? అని ఒక పెద్దమనిషి అడిగాడట. దాన్ని కొట్టిపారెయ్య కుండా సీరియస్‌గా తీసుకుని ఆరుద్ర''రాముడికి సీత ఏమౌతుంది?'' అన్న పరిశోధక గ్రంథం రాశారు. అందువల్ల వేదాలలోని తాత్విక భావ జాల సారాంశం, వెయ్యి సంవత్సరాల వేదకాలంలోను, అనంతర కాలంలోను దానిలో వచ్చిన పరిణామం ఏమిటో తప్పకుండా తెలుసుకోవలసిందే. దానిని మరో వ్యాసంలో చూద్దాం.


Article From MarkistPaper Writen By ఎం.వి.ఎస్‌. శర్మ

Tuesday, May 4, 2010

అమెరికన్‌ ప్రజాస్వామ్యాన్ని కబళించిన కార్పొరేట్‌ స్వామ్యం

2010 జనవరి 21....ఆ రోజు అమెరికన్‌ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక చీకటి రోజు. మరొక ఘోర పతనం. ఎన్నికలకు నిధులు సమకూర్చడం ద్వారా బహుళజాతి కంపెనీలు చేసే రాజకీయ వ్యయం మీద ప్రభుత్వం నిషేధం విధించరాదని అమెరి కన్‌ సుప్రీం న్యాయస్థానం తీర్పునిచ్చింది ఆ రోజున. ఈ తీర్పు ప్రభుత్వ విధానాలను జాతీ యంగా, అంతర్జాతీయంగా ప్రభావితం చేసేం దుకు బహుళజాతి కంపెనీలకు పూర్తి అవకాశం రాసిచ్చినట్లే. అమెరికన్‌ రాజకీయ వ్యవస్థను కార్పొరేట్‌ శక్తులు మరింతగా కబళించడానికి ఊతం ఇచ్చే తీర్పు ఇది.

''ఈ తీర్పు అమెరికన్‌ ప్రజాస్వామ్యం గుండెల్లో దిగబడిన పిడిబాకు. బహుళజాతి కంపెనీలు తమ బొక్కసాలనుండి కాస్తంత ఖర్చుచేసి ఎన్నికలను ప్రభావితం చెయ్యడానికీ, ఆనక ఎన్నికయిన ప్రజా ప్రతినిధులమీద ఒత్తిడి చేసి మరీ తమ కోర్కెలు ఈడేర్చేలా చేసుకునేం దుకూ మార్గం సుగమం చేసింది'' అని న్యూయా ర్క్‌ టైమ్స్‌ పత్రిక వ్యాఖ్యానించింది. తీర్పు విషయమై న్యాయమూర్తులలో విభజన ఓటింగ్‌ జరిగింది. 5-4 ఓట్ల తేడాతో ఈ తీర్పు వెలువడింది. జస్టిస్‌ ఆంథోని ఎం. కెనడీకి ఊతంగా మరో నలుగురు ప్రతీఘాత జడ్జిలు (జనాలను తప్పుదోవ పట్టించడానికి కన్సర్వేటివ్‌ జడ్జిలు అనే పదం వాడుతున్నారు) కలవడంతో మెజారిటీ తీర్పు ఇట్లా వచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జాన్‌ జి. రాబర్ట్‌ జూనియర్‌ అతి సున్నితంగా తేల్చేసే అవకాశం ఉన్న ఈ వాజ్యాన్ని లాగి పీకి పాకంపెట్టి మరీ ఇంతదాకా తెచ్చాడు. ఫెడరల్‌ ఎన్నికల ప్రచారానికి కార్పొ రట్‌ కంపెనీలు అందచేసే నిధులమీద గత వందేళ్ళుగా కొనసాగుతున్న పరిమితులు బదా బదలయ్యే పరిస్థితి వచ్చేసింది. ఇక డొంక తిరుగుడు వ్యవహారాలతో పనిలేదు. కార్పొరేట్‌ మేనేజర్లు ఇక నుండి నేరుగా, ప్రత్యక్షంగా ఎన్నికల కొనుగోళ్ళకు దిగిపోవచ్చు. కార్పొరేట్‌ కంపెనీలు అందించే నిధులు బహు సంక్లిష్టంగా ఏ మాత్రం పారదర్శ కత లేకుండా పనిచేస్తాయి. ఎన్నికల త్రాసులో మొగ్గును ప్రభావితం చేసేదీ ఈ కార్పొరేట్‌ కంపెనీల నిధుల వరదే. అందుకే ప్రభుత్వ విధానాలను కూడా శాసించగలుగుతారు. ఆర్థిక వ్యవస్థను తమ గుప్పిటలో ఉంచుకున్న అతికొద్ది మంది కార్పొరేట్‌ శక్తుల చేతుల్లో ప్రజాస్వా మ్యాన్ని పెట్టేశారు.

థామస్‌ ఫెర్గూసన్‌, పేరొందిన రాజకీయ ఆర్థిక విశ్లేషకుడు. 'రాజకీయ పెట్టుబడి సిద్థాం తాన్ని' ప్రతిపాదించాడు. ఈ సిద్థాంతం ఆధారంగా చాలాకాలంగా కార్పొరేట్‌ పెట్టుబడు లు రాజకీయ విధివిధాన నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయో ముందస్తు అంచనాలు చెబుతూ వచ్చాడు. వాటిల్లో ఏవీ పొల్లుపోలేదు. ప్రైవేట్‌ కార్పొరేట్‌ రంగం, రాజ్యంమీద నియం త్రణ సాధించడానికి ఎన్నికల సందర్భంగా ఎందుకు పెట్టుబడులు పెడుతుందో కడు చక్కగా వివరించాడాయన తన సిద్థాంతంలో. జనవరి 21 సుప్రీం న్యాయస్థానం వెలువ రించిన ఈ తీర్పు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసే శక్తులను మరింత బలోపేతం చేస్తుంది. ఈ తీర్పు వెనుక నేపథ్యం గొప్ప జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. జస్టిస్‌ జాన్‌పాల్‌ స్టీవెన్స్‌ వాదన చూడండి- ''కార్పొరేట్‌ కంపెనీలకు రాజ్యాంగ తొలి సవరణ వర్తిస్తుందని మనం ఏనాడో నిర్ధారించాం. ఈ తొలి సవరణ వాక్‌స్వాతంత్య్రా నికి రాజ్యాంగ హామీని కల్పిస్తుంది. వాక్‌స్వాతం త్య్రం అంటే రాజకీయ అభ్యర్థులను బలపరచడం కూడా'' అన్నారు.

20వ శతాబ్దం తొలినాళ్లలో న్యాయ సిద్థాం తవేత్తలూ, కోర్టులూ కలిసి - రక్త మాంసాలు ఉన్న మనిషికి ఉన్నట్లే ఈ సమిష్టి చట్టబద్ధమైన సంస్థలకు (కార్పొరేట్‌ కంపెనీలకు) కూడా సమాన రాజ్యాంగ హక్కులు ఉంటాయన్న 1886 నాటి నిర్ణయాన్ని అమలులోకి తెచ్చాయి. ఈ ఉదారవాద దాడి ప్రమాదాన్నీ, దాని పర్యవసానాలనూ ఆనాడే పసిగట్టి ఖండించిన వారూ ఉన్నారు. ''ఈ నిర్ణయం వ్యక్తి స్వేచ్ఛను హరించివేస్తుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రజారంజక ప్రభుత్వాల స్థిరత్వం దెబ్బతినిపో తుంది'' అని క్రిస్టఫర్‌ జి టైడ్‌మాన్‌ అభివర్ణించాడు.
''కార్పొరేట్‌ రంగంలో అధికారం క్రమక్ర మంగా వాటాదారుల (షేర్‌ హౌల్డర్స్‌) చేతుల్లో నుండి మేనేజర్లకు అక్కడినుండి చివరకు 'బోర్డు డైరెక్టర్ల అధికారాలకు' దఖలు పడడం ద్వారా కార్పొరేట్‌ సంస్థలు 1886 నాటి వ్యక్తిగత స్థాయినుండి సర్వాధికారాలు కూడగట్టుకున్న వ్యవస్థలుగా స్థిరపడిపోయాయి'' అంటూ 'ప్రామాణిక న్యాయచరిత్ర' అన్న గ్రంథంలో మోర్టాన్‌ హౌర్‌విట్జ్‌ పేర్కొన్నాడు. ఆ తరువాత 'స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు' అనే తప్పుడు నామాలతో కార్పొరేట్‌ శక్తులు మరింత బలప డ్డాయి. ఎంతగా బలపడ్డాయి అంటే ఉదాహర ణకు జనరల్‌ మోటార్స్‌ కంపెనీ మెక్సికోలో ఒక ప్లాంట్‌ పెట్టి, దానికి మెక్సికో పరిశ్రమలకు ఆ దేశం ఇచ్చే హౌదాలూ, హక్కులూ, రాయితీ లూ ఇవ్వాలనీ, తమ ప్లాంట్‌ను కూడా జాతీయ పరిశ్రమగా గుర్తించాలనీ డిమాండ్‌ చేసేంతగా బలపడ్డాయి. కానీ విచిత్రం ఏమిటంటే రక్త మాంసాలున్న ఒక మెక్సికో దేశపు పౌరుడు, న్యూయార్క్‌ మహానగరంలో స్థిరపడిన తనకూ జాతీయ పౌరసత్వంగల అమెరికన్‌లతో సమాన హౌదా, గౌరవం, హక్కులూ ఇవ్వమని కాదు కదా కనీస మానవ హక్కుల గురించి కూడా డిమాండ్‌ చేసే పరిస్థితి లేదు. వందేళ్ళ క్రితమే ఉడ్రో విల్సన్‌ అమెరికాలో నెలకొన్న పరిస్థితుల గురించి ఇలా అభివర్ణిం చాడు: ''సాపేక్షంగా కొద్దిపాటి గుంపుగా ఉన్న వ్యక్తులూ, కార్పొరేట్‌ మేనేజర్లూ దేశ సంపద మీద, వ్యాపార కార్యకలాపాల మీద ఆధిపత్యం, నియంత్రణ సంపాదించారు. తద్వారా ప్రభు త్వానికి ప్రత్యర్థులుగా మారారు'' అన్నాడు. నిజానికి ఈ కొద్దిపాటి గుంపే రాను రానూ ప్రభుత్వానికి యజమానులుగా తయార య్యారు. రాబర్ట్స్‌ కోర్టు తీర్పు వారి యాజమా న్యాన్ని మరింత చట్టబద్ధం చేసింది. జనవరి 21 కోర్టు తీర్పు కూడా సంపద - అధికారం సాధించిన ఒక విజయానికి మూడు రోజుల తరువాత వెలువడడం యాదృచ్ఛిక మేనేమో. మాస్సాచ్యుట్స్‌లో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికలలో డెమోక్రాట్ల సింహాసనంగా కొనసాగుతూ వచ్చిన సెనెటర్‌ పీఠాన్ని రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి స్కాట్‌ బ్రౌన్‌ గెలుచుకున్నాడు. బ్రౌన్‌ విజయాన్ని (ఒబామా నాయకత్వంలోని) డెమోక్రాట్‌ ప్రభుత్వంమీద పెరిగిపోతున్న ప్రజా అసంతృప్తికి చిహ్నంగా చిత్రీకరిస్తారు. కానీ ఓటింగ్‌ సరళి మనకు భిన్నమైన కథనాన్ని బయట పెడుతుంది.

సంపన్నులు నివసించే పట్టణ ప్రాంతాల్లో అత్యధిక ఓటింగ్‌, డెమొక్రాట్ల ఆధిపత్యం ఉన్న పట్టణ ప్రాంతాల్లో తగ్గిన పోలింగ్‌ బ్రౌన్‌ విజ యానికి దోహదం చేసింది. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌/యన్‌.బి.సి. పోల్‌ సర్వేలో రిపబ్లికన్‌ అనుకూల ఓటర్లలో 55 శాతం మంది ఓటింగ్‌ వెయ్య డానికి ఆసక్తి చూపిస్తున్నట్లు, డెమొక్రటిక్‌ ఓటర్లలో 38 శాతం మందే ఆసక్తి కనబరిచినట్లు వెల్ల డయ్యింది. అందుకే ఫలితాలు ప్రెసిడెంట్‌ ఒబామా విధానాలకు వ్యతిరేకంగా వచ్చాయి. సంపన్నులు మరింత సంపన్నులు కావడానికి ఒబామా విధానాలు తగిన ప్రోత్సాహం కల్పించనందున ధన్యాడ్య వర్గాల్లో అసంతృప్తి, పేద ప్రజానీకంలో తాము ఆశించిన ప్రయోజనాలు అందుకోవ డానికి ఇంకా చాలాకాలం వేచి ఉండాల్సి వచ్చేట్లుందే అన్న అసంతృప్తి. ప్రజాస్వామ్యంలో నెలకొన్న ఆగ్రహావేశా లను మనం అర్థం చేసుకోవచ్చు. ఒకపక్కన ప్రజాధనాన్ని బ్యాంకులు దిగమింగేస్తూ మరోపక్కన ప్రభుత్వం నుండి 'బెయిల్‌ అవుట్‌' ప్యాకేజీలు పొందుతూ ఉన్నాయి. ఇంకోపక్కన నిరుద్యోగం 10 శాతానికి మించిపోయింది. ఉత్పత్తిరంగంలో ప్రతి ఆరుగురిలో ఒకరు పని కోల్పోతున్నారు. ఈ రంగంలో నిరుద్యోగిత 1930 మహా మాంద్యం నాటిస్థాయిలో ఉంది. ఆర్థికవ్యవస్థ నానాటికీ ద్రవ్యీకరణ (ఫైనాన్షియలైజేషన్‌) చెందడం, ఉత్పాదకరంగం బోలుగా తయారవడం, కోల్పోయిన ఉద్యోగాలు తిరిగి పొందే అవకాశాలు సన్నగిల్లడం... ఇవన్నీ సామాన్య ప్రజానీకంలో అసంతృప్తికి దారితీశాయి.

బ్రౌన్‌ తన విజయాన్ని ఒబామా ప్రభు త్వం ప్రతిపాదించిన ఆరోగ్య సంరక్షణ విధానా లపట్ల 41 శాతం వ్యతిరేకతగా చెప్పు కొంటున్నాడు. అమెరికన్‌ సెనెట్‌లో మెజారిటీ ఈ బిల్లును సమర్థించారన్న వాస్తవం కన్నా, తన ఎన్నికే ఈ బిల్లు పట్ల ప్రజా వ్యతిరేకతకు అద్దం పడుతుందనే వాదనకు దిగాడు. మస్సాచ్యుసెట్స్‌ ఎన్నికలలో ఒబామా ఆరోగ్య సంరక్షణ విధానం కూడా ఒక అంశం గా ముందుకు వచ్చింది. ప్రజలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారనే వార్తాపత్రికల పతాక శీర్షికల్లో కూడా నిజంలేదు. కారణం ఏమిటి అనేది పోలింగ్‌ వివరాలు వెల్లడిస్తాయి. బిల్లు ఆను పానులు క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం పొందలేదు. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌/ఎన్‌.బి.సి. సంయుక్త సర్వేలో మెజారిటీ ఓటర్లు ఆరోగ్య సంరక్షణ విధానాన్ని ఒబామా, రిపబ్లిన్‌లు 'హ్యాండిల్‌' చేస్తున్న తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ లెక్కలు దేశవ్యాప్తంగా జరిగిన పోల్‌ సర్వేల వివరాలతో సరిపోతున్నాయి. ఔషధాల (మందులు) అమ్మకాల్లో ప్రభుత్వ రంగానికి భాగస్వామ్యం ఉండాలని 50 శాతం మంది, 55 ఏళ్ళ వయసులో 'మెడికేర్‌' ఆరోగ్య ఇన్స్యూరెన్స్‌ పాలసీ' ఉండాలనుకునేవారు 64 శాతం మంది ఉన్నారు. కానీ ఈ రెండు పథకా లను మూలనపెట్టారు.
ఇతర దేశాల్లో మాదిరిగానే మందుల ధరలను ప్రభుత్వం నియంత్రించాలని 85 శాతం మంది కోరుతున్నారు. కానీ ప్రెసిడెంట్‌ ఒబామా తన సర్కారు అటువంటి ప్రయత్నం చెయ్యదని బహుళజాతి మందుల కంపెనీలకు హామీ ఇచ్చాడు. సామాన్య ప్రజానీకం ఎక్కువ మంది మందుల ధరలు తగ్గాలని ఆశిస్తున్నారు. ఇతర పారిశ్రామి దేశాలతో పోలిస్తే అమెరికా లో ఆరోగ్య సంరక్షణకు రెండింతలు ఖర్చు చెయ్యాల్సి వస్తుంది. అయినా ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయి. ఆరోగ్య సంరక్షణ కోసం చేసే తలసరి ఖర్చుల భారం తగ్గాలంటే నేడు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు మందుల కంపెనీలకు రాయితీల వర్షం కురిపించినంత మాత్రాన ప్రయోజనం లేదు. ఇన్స్యూరెన్స్‌ పథకాలు సర్వం ఎటువంటి నియంత్రణాలేని ప్రైవేటు కంపెనీల చేతుల్లో బిల్‌మక్తాగా చిక్కుపడి ఉన్నాయి. అందుకే అమెరికాలో వైద్యం ఇంత ఖరీదయి పోయింది. ప్రజారోగ్య రంగాన్ని ఆవరించిన సంక్షో భాన్ని అధిగమించడానికి జరుగుతున్న ప్రయత్నా లకు జనవరి 21 తీర్పు వల్ల ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి ఉంది. ఇంధన- పర్యావరణ సమస్యల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ప్రజాభిప్రాయానికి- ప్రభుత్వ విధానాలకు మధ్య అంతరం నానాటికీ పెరుగుతోంది. ఈ లెక్కన అమెరికన్‌ ప్రజాస్వా మ్యానికి వాటిల్లనున్న నష్టం లెక్కించడం కూడా కష్టమే.

Article took from Markist Paper written By :NomoChimiski

Tuesday, March 2, 2010

A Magic With Right Foot





















                                                                                  
Hai Friendssssss.......................

YesterDay I have Read a Article Regarding the Brain.....I didnot Belived it First But After Trying this I was VeryMuch Surprised.......I am writing Some Small Notessssss Here........

This Will Confuse Your Mind and You will keep Trying over and over again to see if you can outsmart your foor,but,you can't.It is Pre-Programmed In Your Brain......

Please Try the Following steps it willl take only Secondsssssss

1.While Sitting or Standing,Lift Your Right foot off the Floor and make clockwise circles.

2.Now while doing this draw the number '6' in the air with your right hand.Your foot will change Direction.

After trying this Iam Sure that you will do it again and againnnnnnn.

Now Iam Searching for the Name of OrthopedicSurgeon who found this?Iam Sure I will write this soon in my blogssss

Thursday, February 25, 2010

WE SHALL OVER COME

We shall overcome
We shall overcome
We shall overcome some day

     Oh, deep in my heart
     I  do believe
    We shall overcome some day 


We'll walk hand in hand
We'll walk hand in hand
We'll walk hand in hand some day 

Oh, deep in my heart
     I  do believe
    We shall overcome some day

      We shall all be free
      We shall all be free
      We shall all be free some day 
Oh, deep in my heart
     I  do believe
    We shall overcome some day

We are not afraid
We are not afraid
We are not afraid some day


Oh, deep in my heart
     I  do believe
    We shall overcome some day 


       We are not alone
       We are not alone
       We are not alone some day
Oh, deep in my heart
     I  do believe
    We shall overcome some day

The whole wide world around
The whole wide world around
The whole wide world around someday

Oh, deep in my heart      I  do believe
    We shall overcome some day

We're on to victory, We're on to victory,
We're on to victory someday;
Oh, deep in my heart, I do believe,
We're on to victory someday.

       
Oh, deep in my heart
     I  do believe
    We shall overcome some day
The truth shall set us free , the truth shall set us free,
      The truth shall set us free someday;
      Oh, deep in my heart, I do believe,
      The truth shall set us free someday.

Oh, deep in my heart
     I  do believe
    We shall overcome some day


We shall live in peace, we shall live in peace,
We shall live in peace someday;
Oh, deep in my heart, I do believe,
We shall live in peace someday.

       Oh, deep in my heart
     I  do believe
    We shall overcome some day



"We Shall Overcome"  song became particularly popular in the 1960s, during the Civil Rights movement in America .You can know more details in the wikipedia iam ataching the link here we shall over come

Friday, February 12, 2010

What  is TRP ?

Hi Friends,

Last week i watched a Tv Show there was discussion going on different topics some body said that News Channels were playing a cheap tricks to increase their TRP.I thought  TRP means Television Rating Points.So I want to clear my doubt about TRP so i started to search on the net and I found lots of intresting topics on the net so just i want to share some with You....

TRP Means  Targeted rating points.


and I also Want to share diffence between TRP and GRP a small discussion i am writing hereeeeee


In a broadcast media Gross Rating Points (GRP's) are used in media buying and media effectivess analysis. They represent the Reach or audience share of your spots or placements (a function of what stations you buy and when the ads run) times the Frequency or number of spots (advertisements) run. Each GRP represents 1%.

Over a period of time and with multiple impressions, the GRP can be 200, 500 or more. For example a GRP of 100 could mean that you bought a hundred spots with a 1% reach or that you bought 2 spots with a 50% reach.

Targeted Rating Points are a refinement of GRP's to express the reach time frequency of only your most likely prospects. For example, if you buy 150 GRP's for a television spot, but you know that only half of that audience is actually your market, then you would state your TRP as 75 to calculate your net effective buy.

Byeeeeeeee for Todayyyyyyyy.........................