2010 జనవరి 21....ఆ రోజు అమెరికన్ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక చీకటి రోజు. మరొక ఘోర పతనం. ఎన్నికలకు నిధులు సమకూర్చడం ద్వారా బహుళజాతి కంపెనీలు చేసే రాజకీయ వ్యయం మీద ప్రభుత్వం నిషేధం విధించరాదని అమెరి కన్ సుప్రీం న్యాయస్థానం తీర్పునిచ్చింది ఆ రోజున. ఈ తీర్పు ప్రభుత్వ విధానాలను జాతీ యంగా, అంతర్జాతీయంగా ప్రభావితం చేసేం దుకు బహుళజాతి కంపెనీలకు పూర్తి అవకాశం రాసిచ్చినట్లే. అమెరికన్ రాజకీయ వ్యవస్థను కార్పొరేట్ శక్తులు మరింతగా కబళించడానికి ఊతం ఇచ్చే తీర్పు ఇది.
''ఈ తీర్పు అమెరికన్ ప్రజాస్వామ్యం గుండెల్లో దిగబడిన పిడిబాకు. బహుళజాతి కంపెనీలు తమ బొక్కసాలనుండి కాస్తంత ఖర్చుచేసి ఎన్నికలను ప్రభావితం చెయ్యడానికీ, ఆనక ఎన్నికయిన ప్రజా ప్రతినిధులమీద ఒత్తిడి చేసి మరీ తమ కోర్కెలు ఈడేర్చేలా చేసుకునేం దుకూ మార్గం సుగమం చేసింది'' అని న్యూయా ర్క్ టైమ్స్ పత్రిక వ్యాఖ్యానించింది. తీర్పు విషయమై న్యాయమూర్తులలో విభజన ఓటింగ్ జరిగింది. 5-4 ఓట్ల తేడాతో ఈ తీర్పు వెలువడింది. జస్టిస్ ఆంథోని ఎం. కెనడీకి ఊతంగా మరో నలుగురు ప్రతీఘాత జడ్జిలు (జనాలను తప్పుదోవ పట్టించడానికి కన్సర్వేటివ్ జడ్జిలు అనే పదం వాడుతున్నారు) కలవడంతో మెజారిటీ తీర్పు ఇట్లా వచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జాన్ జి. రాబర్ట్ జూనియర్ అతి సున్నితంగా తేల్చేసే అవకాశం ఉన్న ఈ వాజ్యాన్ని లాగి పీకి పాకంపెట్టి మరీ ఇంతదాకా తెచ్చాడు. ఫెడరల్ ఎన్నికల ప్రచారానికి కార్పొ రట్ కంపెనీలు అందచేసే నిధులమీద గత వందేళ్ళుగా కొనసాగుతున్న పరిమితులు బదా బదలయ్యే పరిస్థితి వచ్చేసింది. ఇక డొంక తిరుగుడు వ్యవహారాలతో పనిలేదు. కార్పొరేట్ మేనేజర్లు ఇక నుండి నేరుగా, ప్రత్యక్షంగా ఎన్నికల కొనుగోళ్ళకు దిగిపోవచ్చు. కార్పొరేట్ కంపెనీలు అందించే నిధులు బహు సంక్లిష్టంగా ఏ మాత్రం పారదర్శ కత లేకుండా పనిచేస్తాయి. ఎన్నికల త్రాసులో మొగ్గును ప్రభావితం చేసేదీ ఈ కార్పొరేట్ కంపెనీల నిధుల వరదే. అందుకే ప్రభుత్వ విధానాలను కూడా శాసించగలుగుతారు. ఆర్థిక వ్యవస్థను తమ గుప్పిటలో ఉంచుకున్న అతికొద్ది మంది కార్పొరేట్ శక్తుల చేతుల్లో ప్రజాస్వా మ్యాన్ని పెట్టేశారు.
థామస్ ఫెర్గూసన్, పేరొందిన రాజకీయ ఆర్థిక విశ్లేషకుడు. 'రాజకీయ పెట్టుబడి సిద్థాం తాన్ని' ప్రతిపాదించాడు. ఈ సిద్థాంతం ఆధారంగా చాలాకాలంగా కార్పొరేట్ పెట్టుబడు లు రాజకీయ విధివిధాన నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయో ముందస్తు అంచనాలు చెబుతూ వచ్చాడు. వాటిల్లో ఏవీ పొల్లుపోలేదు. ప్రైవేట్ కార్పొరేట్ రంగం, రాజ్యంమీద నియం త్రణ సాధించడానికి ఎన్నికల సందర్భంగా ఎందుకు పెట్టుబడులు పెడుతుందో కడు చక్కగా వివరించాడాయన తన సిద్థాంతంలో. జనవరి 21 సుప్రీం న్యాయస్థానం వెలువ రించిన ఈ తీర్పు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసే శక్తులను మరింత బలోపేతం చేస్తుంది. ఈ తీర్పు వెనుక నేపథ్యం గొప్ప జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. జస్టిస్ జాన్‌పాల్ స్టీవెన్స్ వాదన చూడండి- ''కార్పొరేట్ కంపెనీలకు రాజ్యాంగ తొలి సవరణ వర్తిస్తుందని మనం ఏనాడో నిర్ధారించాం. ఈ తొలి సవరణ వాక్‌స్వాతంత్య్రా నికి రాజ్యాంగ హామీని కల్పిస్తుంది. వాక్‌స్వాతం త్య్రం అంటే రాజకీయ అభ్యర్థులను బలపరచడం కూడా'' అన్నారు.
20వ శతాబ్దం తొలినాళ్లలో న్యాయ సిద్థాం తవేత్తలూ, కోర్టులూ కలిసి - రక్త మాంసాలు ఉన్న మనిషికి ఉన్నట్లే ఈ సమిష్టి చట్టబద్ధమైన సంస్థలకు (కార్పొరేట్ కంపెనీలకు) కూడా సమాన రాజ్యాంగ హక్కులు ఉంటాయన్న 1886 నాటి నిర్ణయాన్ని అమలులోకి తెచ్చాయి. ఈ ఉదారవాద దాడి ప్రమాదాన్నీ, దాని పర్యవసానాలనూ ఆనాడే పసిగట్టి ఖండించిన వారూ ఉన్నారు. ''ఈ నిర్ణయం వ్యక్తి స్వేచ్ఛను హరించివేస్తుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రజారంజక ప్రభుత్వాల స్థిరత్వం దెబ్బతినిపో తుంది'' అని క్రిస్టఫర్ జి టైడ్‌మాన్ అభివర్ణించాడు.
''కార్పొరేట్ రంగంలో అధికారం క్రమక్ర మంగా వాటాదారుల (షేర్ హౌల్డర్స్) చేతుల్లో నుండి మేనేజర్లకు అక్కడినుండి చివరకు 'బోర్డు డైరెక్టర్ల అధికారాలకు' దఖలు పడడం ద్వారా కార్పొరేట్ సంస్థలు 1886 నాటి వ్యక్తిగత స్థాయినుండి సర్వాధికారాలు కూడగట్టుకున్న వ్యవస్థలుగా స్థిరపడిపోయాయి'' అంటూ 'ప్రామాణిక న్యాయచరిత్ర' అన్న గ్రంథంలో మోర్టాన్ హౌర్‌విట్జ్ పేర్కొన్నాడు. ఆ తరువాత 'స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు' అనే తప్పుడు నామాలతో కార్పొరేట్ శక్తులు మరింత బలప డ్డాయి. ఎంతగా బలపడ్డాయి అంటే ఉదాహర ణకు జనరల్ మోటార్స్ కంపెనీ మెక్సికోలో ఒక ప్లాంట్ పెట్టి, దానికి మెక్సికో పరిశ్రమలకు ఆ దేశం ఇచ్చే హౌదాలూ, హక్కులూ, రాయితీ లూ ఇవ్వాలనీ, తమ ప్లాంట్‌ను కూడా జాతీయ పరిశ్రమగా గుర్తించాలనీ డిమాండ్ చేసేంతగా బలపడ్డాయి. కానీ విచిత్రం ఏమిటంటే రక్త మాంసాలున్న ఒక మెక్సికో దేశపు పౌరుడు, న్యూయార్క్ మహానగరంలో స్థిరపడిన తనకూ జాతీయ పౌరసత్వంగల అమెరికన్‌లతో సమాన హౌదా, గౌరవం, హక్కులూ ఇవ్వమని కాదు కదా కనీస మానవ హక్కుల గురించి కూడా డిమాండ్ చేసే పరిస్థితి లేదు. వందేళ్ళ క్రితమే ఉడ్రో విల్సన్ అమెరికాలో నెలకొన్న పరిస్థితుల గురించి ఇలా అభివర్ణిం చాడు: ''సాపేక్షంగా కొద్దిపాటి గుంపుగా ఉన్న వ్యక్తులూ, కార్పొరేట్ మేనేజర్లూ దేశ సంపద మీద, వ్యాపార కార్యకలాపాల మీద ఆధిపత్యం, నియంత్రణ సంపాదించారు. తద్వారా ప్రభు త్వానికి ప్రత్యర్థులుగా మారారు'' అన్నాడు. నిజానికి ఈ కొద్దిపాటి గుంపే రాను రానూ ప్రభుత్వానికి యజమానులుగా తయార య్యారు. రాబర్ట్స్ కోర్టు తీర్పు వారి యాజమా న్యాన్ని మరింత చట్టబద్ధం చేసింది. జనవరి 21 కోర్టు తీర్పు కూడా సంపద - అధికారం సాధించిన ఒక విజయానికి మూడు రోజుల తరువాత వెలువడడం యాదృచ్ఛిక మేనేమో. మాస్సాచ్యుట్స్‌లో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికలలో డెమోక్రాట్ల సింహాసనంగా కొనసాగుతూ వచ్చిన సెనెటర్ పీఠాన్ని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి స్కాట్ బ్రౌన్ గెలుచుకున్నాడు. బ్రౌన్ విజయాన్ని (ఒబామా నాయకత్వంలోని) డెమోక్రాట్ ప్రభుత్వంమీద పెరిగిపోతున్న ప్రజా అసంతృప్తికి చిహ్నంగా చిత్రీకరిస్తారు. కానీ ఓటింగ్ సరళి మనకు భిన్నమైన కథనాన్ని బయట పెడుతుంది.
సంపన్నులు నివసించే పట్టణ ప్రాంతాల్లో అత్యధిక ఓటింగ్, డెమొక్రాట్ల ఆధిపత్యం ఉన్న పట్టణ ప్రాంతాల్లో తగ్గిన పోలింగ్ బ్రౌన్ విజ యానికి దోహదం చేసింది. వాల్‌స్ట్రీట్ జర్నల్/యన్.బి.సి. పోల్ సర్వేలో రిపబ్లికన్ అనుకూల ఓటర్లలో 55 శాతం మంది ఓటింగ్ వెయ్య డానికి ఆసక్తి చూపిస్తున్నట్లు, డెమొక్రటిక్ ఓటర్లలో 38 శాతం మందే ఆసక్తి కనబరిచినట్లు వెల్ల డయ్యింది. అందుకే ఫలితాలు ప్రెసిడెంట్ ఒబామా విధానాలకు వ్యతిరేకంగా వచ్చాయి. సంపన్నులు మరింత సంపన్నులు కావడానికి ఒబామా విధానాలు తగిన ప్రోత్సాహం కల్పించనందున ధన్యాడ్య వర్గాల్లో అసంతృప్తి, పేద ప్రజానీకంలో తాము ఆశించిన ప్రయోజనాలు అందుకోవ డానికి ఇంకా చాలాకాలం వేచి ఉండాల్సి వచ్చేట్లుందే అన్న అసంతృప్తి. ప్రజాస్వామ్యంలో నెలకొన్న ఆగ్రహావేశా లను మనం అర్థం చేసుకోవచ్చు. ఒకపక్కన ప్రజాధనాన్ని బ్యాంకులు దిగమింగేస్తూ మరోపక్కన ప్రభుత్వం నుండి 'బెయిల్ అవుట్' ప్యాకేజీలు పొందుతూ ఉన్నాయి. ఇంకోపక్కన నిరుద్యోగం 10 శాతానికి మించిపోయింది. ఉత్పత్తిరంగంలో ప్రతి ఆరుగురిలో ఒకరు పని కోల్పోతున్నారు. ఈ రంగంలో నిరుద్యోగిత 1930 మహా మాంద్యం నాటిస్థాయిలో ఉంది. ఆర్థికవ్యవస్థ నానాటికీ ద్రవ్యీకరణ (ఫైనాన్షియలైజేషన్) చెందడం, ఉత్పాదకరంగం బోలుగా తయారవడం, కోల్పోయిన ఉద్యోగాలు తిరిగి పొందే అవకాశాలు సన్నగిల్లడం... ఇవన్నీ సామాన్య ప్రజానీకంలో అసంతృప్తికి దారితీశాయి.
బ్రౌన్ తన విజయాన్ని ఒబామా ప్రభు త్వం ప్రతిపాదించిన ఆరోగ్య సంరక్షణ విధానా లపట్ల 41 శాతం వ్యతిరేకతగా చెప్పు కొంటున్నాడు. అమెరికన్ సెనెట్‌లో మెజారిటీ ఈ బిల్లును సమర్థించారన్న వాస్తవం కన్నా, తన ఎన్నికే ఈ బిల్లు పట్ల ప్రజా వ్యతిరేకతకు అద్దం పడుతుందనే వాదనకు దిగాడు. మస్సాచ్యుసెట్స్ ఎన్నికలలో ఒబామా ఆరోగ్య సంరక్షణ విధానం కూడా ఒక అంశం గా ముందుకు వచ్చింది. ప్రజలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారనే వార్తాపత్రికల పతాక శీర్షికల్లో కూడా నిజంలేదు. కారణం ఏమిటి అనేది పోలింగ్ వివరాలు వెల్లడిస్తాయి. బిల్లు ఆను పానులు క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం పొందలేదు. వాల్‌స్ట్రీట్ జర్నల్/ఎన్.బి.సి. సంయుక్త సర్వేలో మెజారిటీ ఓటర్లు ఆరోగ్య సంరక్షణ విధానాన్ని ఒబామా, రిపబ్లిన్‌లు 'హ్యాండిల్' చేస్తున్న తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ లెక్కలు దేశవ్యాప్తంగా జరిగిన పోల్ సర్వేల వివరాలతో సరిపోతున్నాయి. ఔషధాల (మందులు) అమ్మకాల్లో ప్రభుత్వ రంగానికి భాగస్వామ్యం ఉండాలని 50 శాతం మంది, 55 ఏళ్ళ వయసులో 'మెడికేర్' ఆరోగ్య ఇన్స్యూరెన్స్ పాలసీ' ఉండాలనుకునేవారు 64 శాతం మంది ఉన్నారు. కానీ ఈ రెండు పథకా లను మూలనపెట్టారు.
ఇతర దేశాల్లో మాదిరిగానే మందుల ధరలను ప్రభుత్వం నియంత్రించాలని 85 శాతం మంది కోరుతున్నారు. కానీ ప్రెసిడెంట్ ఒబామా తన సర్కారు అటువంటి ప్రయత్నం చెయ్యదని బహుళజాతి మందుల కంపెనీలకు హామీ ఇచ్చాడు. సామాన్య ప్రజానీకం ఎక్కువ మంది మందుల ధరలు తగ్గాలని ఆశిస్తున్నారు. ఇతర పారిశ్రామి దేశాలతో పోలిస్తే అమెరికా లో ఆరోగ్య సంరక్షణకు రెండింతలు ఖర్చు చెయ్యాల్సి వస్తుంది. అయినా ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయి. ఆరోగ్య సంరక్షణ కోసం చేసే తలసరి ఖర్చుల భారం తగ్గాలంటే నేడు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు మందుల కంపెనీలకు రాయితీల వర్షం కురిపించినంత మాత్రాన ప్రయోజనం లేదు. ఇన్స్యూరెన్స్ పథకాలు సర్వం ఎటువంటి నియంత్రణాలేని ప్రైవేటు కంపెనీల చేతుల్లో బిల్‌మక్తాగా చిక్కుపడి ఉన్నాయి. అందుకే అమెరికాలో వైద్యం ఇంత ఖరీదయి పోయింది. ప్రజారోగ్య రంగాన్ని ఆవరించిన సంక్షో భాన్ని అధిగమించడానికి జరుగుతున్న ప్రయత్నా లకు జనవరి 21 తీర్పు వల్ల ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి ఉంది. ఇంధన- పర్యావరణ సమస్యల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ప్రజాభిప్రాయానికి- ప్రభుత్వ విధానాలకు మధ్య అంతరం నానాటికీ పెరుగుతోంది. ఈ లెక్కన అమెరికన్ ప్రజాస్వా మ్యానికి వాటిల్లనున్న నష్టం లెక్కించడం కూడా కష్టమే.
Article took from Markist Paper written By :NomoChimiski
No comments:
Post a Comment